హరీష్ పెద్ద మనసు..


ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు. ఎవరు కష్టాల్లో ఉన్నా వేగంగా స్పందించే హరీష్.. మంత్రి నారాయణ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా అదే రీతిలో స్పందించి నారాయణ కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి నారాయణ ..   లండన్ పర్యటనలో ఉండడంతో హైదరాబాద్ లో అన్నీ తానై వ్యవహరించి వారి కుటుంబాన్ని ఓదార్చారు.

నారాయణ కొడుకు నిషిత్ మరణవార్త తెలియగానే మంత్రి హరీష్ రావు ఉదయం 6 గంటలకే అపోలో ఆస్పత్రికి వెళ్లి నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిషిత్ మృతదేహానికి అపోలోలోనే ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని నిషిత్ స్వస్థలం నెల్లూరు తరలించేందుకు బేంగపేట ఏవియేషన్ అధికారులతో మాట్లాడి హెలికాప్టర్ ను సిద్ధం చేయించారు. కానీ ఉరుములు, మెరుపుల వర్షం వల్ల.. హెలీక్యాప్టర్ ప్రయాణం సాధ్యం కాలేదు. దీంతో ప్రత్యేకంగా అంబులెన్స్ ను సిద్ధం చేయించి నిషిత్ మృతదేహాన్ని , నారాయణ కుటుంబ సభ్యులను నెల్లూరుకు తరలించారు..

మంత్రి హరీష్.. ప్రమాదం జరిగిన తర్వాత ఉదయం నుంచి నిషిత్ మృతదేహం తరలించే వరకు అపోలో ఆస్పత్రిలోనే ఉండి అన్ని పనులు, పోలీసు కేసు, పోస్టుమార్టం తదితర వ్యవహారాలు నారాయణ కుటుంబ సభ్యులను బాధించకుండా చక్కదిద్దారు. ఆపదలో ఆదుకుంటాడని పేరున్న హరీష్ ఇలా మరోసారి తన దయాగుణాన్ని చాటడంపై సోషల్ మీడియాలో.. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend