ఖర్చు 35కోట్లు.. లాభం 70కోట్లు


రిమేక్ సినిమాలపై ఎక్కడైనా చిన్నచూపే ఉంటుంది. పవన్ కళ్యాన్ తమిళ సినిమా వీరమ్ రిమేక్ చేస్తున్నాడన్న మాట వినగానే ఏదో 50 కోట్ల లోపే అంతా అయిపోతుందని భావించారు. సినిమా పోను 15కోట్ల లాభం వస్తుందని విశ్లేషకులు భావించారు. కానీ ఇప్పుడు సినిమా పూర్తై ఈనెల 24న రిలీజ్ కు సిద్ధం అవుతున్న వేళ.. కాటమరాయుడిపై లాభాల వాన కురుస్తోంది.

కాటమరాయుడు సినిమాకు అందరూ జూనియర్ నటులనే తీసుకున్నారు. వారి పారితోషికం తక్కువే.. ఇక పవన్ కు లాభాల్లో 30శాతం వాటాగా ఉంటుంది. ముఖ్యంగా నైజాం, సీడెడ్ లలో కలెక్షన్లు పవన్ కు ఇచ్చారని తెలిసింది. ఇక పల్లెటూరిలో నడిచిన కథ కాబట్టి భారీ హంగులేవీ లేవు. దీంతో సినిమకు మొత్తం ఖర్చు 25 కోట్లు అయ్యిందట.. సినిమా ప్రమోషన్లు, యాడ్స్ కోసం మరో 10 కోట్లు ఖర్చు చేశారట.. దీంతో కాటమరాయుడు బడ్జెట్ 35 కోట్లు అయ్యిందట..

కానీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికే 105 కోట్లు ఫ్రాఫిట్ వచ్చినట్టు సమాచారం. థియేటర్స్ ద్వారా 85 కోట్లు వచ్చాయట.. మూడు ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాల నుంచి ఈ మొత్తం అందిందట.. అంతేకాకుండా శాటిలైట్ హక్కులు, ఇతర అనువాద హక్కుల రూపంలో మరో ఇరవై కోట్ల వరకు వసూలయ్యాయి. దీంతో సినిమాకు వచ్చిన మొత్తం 105 కోట్లు.. ఖర్చు 35కోట్లు పోను.. నికరంగా 70కోట్ల లాభం.. దీంతో కాటమరాయుడు భారీ లాభాలు సాధించినట్టే..

To Top

Send this to a friend