‘ఖైదీ నెం.150’ రికార్డుల్లో నిజమెంత?

‘బాహుబలి’ చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి తాజాగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో రాధాకృష్ణకు ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కె కార్యక్రమం కోసం ఇంటర్వ్యూ ఇచ్చాడు. రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మగధీర చిత్రం సమయంలో మెగా ఫ్యామిలీతో తనకు ఏర్పడ్డ విభేదాల గురించి ఆయన చెప్పుకొచ్చాడు. మగధీర చిత్రం కలెక్షన్స్‌ పెంచి చూపడంతో పాటు, డబ్బులిచ్చి మరీ అత్యధిక థియేటర్లలో వంద రోజులు ఆడివ్వడం వంటివి తనకు నచ్చలేదు అని, అందుకే 100 రోజుల వేడుకకు తాను హాజరు కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

రాజమౌళి వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు మెగా హీరోల సినిమాల రికార్డులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో మెగా సినిమాలు పలు టాలీవుడ్‌ రికార్డులను సొంతం చేసుకోవడం, బ్రేక్‌ చేయడం జరిగింది. అందులో నిజమైన రికార్డులు ఎన్ని, అబద్దపు రికార్డులు ఎన్ని అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గత సంక్రాంతికి విడుదలైన ‘ఖైదీ నెం. 150’ చిత్రం రికార్డులు అయినా నిజమేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్‌ నెం.3గా మెగాస్టార్‌ రీ ఎంట్రీ 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ చిత్రం ఉంది. బాహుబలి రెండు పార్ట్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అల్లు అరవింద్‌ ఖైదీ సినిమా రికార్డులను క్రియేట్‌ చేశాడా లేక నిజంగా ఖైదీ రికార్డులు సొంతం చేసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 165 కోట్లను వసూళ్లు చేసింది. ఇక అత్యధిక థియేటర్లలో 50 రోజులు మరియు 100 రోజులు ఆడటం జరిగిందని చెబుతున్నారు. కలెక్షన్స్‌ విషయం ఏమో కాని థియేటర్ల సంఖ్య మాత్రం ఖచ్చితంగా ఫేక్‌ అని ఇప్పుడు సినీ వర్గాల వారు అంటున్నారు.

To Top

Send this to a friend