మెద‌టి మూడురోజుల‌కి 11.40 కొట్లు!

గ‌త‌ మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ వైవిద్యంగా వుంటున్నాయి. అంతేకాదు అన్ని చిత్రాలు కమ‌ర్షియ‌ల్ గా బాక్సాఫీస్ వ‌ద్ద  హిట్ అవ్వ‌ట‌మే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ తెచ్చిపెట్టాయి.  నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక్క‌సారి డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం కేశ‌వ‌. ఈ చిత్రం విడుద‌ల‌య్యి అంద‌రి ప్ర‌శంశ‌లు పొంద‌టమే కాకుండా క‌లెక్ష‌న్ల రాబ‌ట్ట‌టంలో విజ‌యం సాధించింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఒపెనింగ్ గా నిల‌వ‌ట‌మే కాకుండా, మెద‌టి వీకెండ్ 11 కొట్ల 40 ల‌క్ష‌లు వ‌సూలు చేసి ఈ వీకెండ్ లో బాక్సాఫీస్ టాప్ చైర్ ని సొంతం చేసుకుంది.

తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం మెద‌టి నుండి ప‌గ‌, ప్ర‌తీకారం అనే క‌థాంశంతో న‌డుస్తుండ‌టంతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో ధియోట‌ర్స్ లో సీట్స్ లో ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిపాడేసింది. చూస్తున్నంత వ‌ర‌కూ క్లైమాక్స్ ఎంట‌నే ఆశ‌క్తితో ప్రేక్ష‌కులు చిత్రాన్ని చూస్తున్నారు. మంచి చిత్రాల‌కి, కొత్త చిత్రాల‌కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డ‌తార‌నేది మ‌రోక్క‌సారి ఈ చిత్రంతో ప్రూవ్ అవ్వ‌టం చాలా హ్య‌పి అంటున్నారు. నిర్మాత అభిషెక్ నామ‌

రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌.

To Top

Send this to a friend