‘కేశవ’ మే 19న గ్రాండ్ రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’… మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వ‌ట‌మే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ సాంధించాడు నిఖిల్‌ సూపర్‌హిట్‌ ఇన్నింగ్స్‌కి స్ట్రాంగ్‌ పునాది వేసిన దర్శకుడు సుధీర్‌వర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక్క‌సారి డిఫిరెంట్ పాయింట్ తో మే 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న చిత్రం కేశ‌వ‌. తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసిన శ్రీ అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత అభిషేక్‌ నామా నిర్మాత. ఇందులో ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి కాళ‌భైర‌వ సాంగ్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం క్రియెట్ చేయ‌గా, ఇప్ప‌డు రెండ‌వ సాంగ్ ని హీరో నిఖిల్ యుస్ లో శ్రీ సాయిద‌త్తా పీఠం లో సుమారు వెయ్య‌మంది తెలుగు సినిమా అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశాడు. ఇక ఈ చిత్రానికి సంబందించి ఆడియో వేడుక‌ని మే13న చేస్తున్నారు. మే 19న సమ్మర్ కానుకగా కేశవ ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ‘‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లకు, టీజర్ కు , సాంగ్స్ కి అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ ద్వారా సినిమాకు ఎంతటి బజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే. అంతకు మించిన ఎంటర్ టైన్ మెంట్ కేశవ ద్వారా లభిస్తుందని గ్యారంటీగా చెప్పగలం. ప్ర‌స్తుతం రెండు సాంగ్స్ విడుద‌ల చేశాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్ర ఆడియో వేడుక‌ని మే 13న చేస్తున్నాము. ‘స్వామి రారా’ తరహాలో ఈ ‘కేశవ’ కూడా టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుందని నమ్ముతున్నాం. నిఖిల్‌–సుధీర్‌వర్మ కాంబినేషన్, డిస్ట్రిబ్యూషన్‌లో మా సంస్థకున్న మంచి పేరు దృష్ట్యా బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. నిఖిల్ ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలానే మంచి కాన్సెప్ట్ తో సుధీర్ వ‌ర్మ అద్బుతంగా తెర‌కెక్కించాడు. మే 13న ధియెట్రిక‌ల్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేస్తాము. ఆ ట్రైల‌ర్ మా చిత్రం పై ప్రేక్ష‌కుల‌కి వున్న క్రేజ్ ని రెట్టింపు చేస్తుంది. రీతూవ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇషికా కొప్పిక‌ర్ మంచి పాత్రలో చాలా గ్యాప్ త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి, మే 19న కేశవను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

హీరో నిఖిల్‌ మాట్లాడుతూ – ‘‘సుధీర్‌వర్మ, నేనూ మంచి స్నేహితులం. ‘స్వామి రారా’తో మా ఇద్దరి కెరీర్‌ కొత్త టర్న్‌ తీసుకుంది. కెశ‌వ మంచి కాన్సెప్ట్‌. సుధీర్‌వర్మ టేకింగ్‌ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నా క్యారెక్టర్‌ ని చాలా కొత్తగా డిజైన్‌ చేశాడు. మే 13న ఆడియో విడుద‌ల చేస్తున్నాము.మే 19న మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు.

దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌ క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగా ఉంటాయి’’ అన్నారు.

రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌.,

సమర్పణ: దేవాన్ష్‌ నామా.
సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల,
నిర్మాత: అభిషేక్‌ నామా,
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ,

To Top

Send this to a friend