కీరవాణిని తిట్టారా..? అందుకే ఆయన రిటైర్..


ఆయన చూస్తే మౌనమునిలా ఉంటాడు. ఎప్పుడూ గంభీర వదనంతో తన పని తాను చేసుకుపోతాడు.. అలాంటి ఆయన బాహుబలి ఆడియో వేడుకలో తాను ఉద్విగ్నతకు గురై.. రాజమౌళిని తన మాటలతో ఏడిపించాడు. ఇప్పుడు ఏమైందో ఏమో సడన్ గా ట్విట్టర్ లో ఇకనుంచి మెదడు లేని డైరెక్టర్ల దగ్గర పనిచేయనని.. అలాంటి వాళ్లు ఉన్నంతవరకు ఇండస్ట్రీలో తాను కొనసాగనని తేల్చిచెప్పారు. తాను పనిచేసిన డైరెక్టర్లలో కొందరు మూగ మనసులు, చెవిటోళ్లు అంటూ విమర్శించారు.

బాహుబలి1 సమయంలోనే కీరవాణి తాను సినిమాలు, సంగీత దర్శకత్వం నుంచి రిటైర్ కాబోతున్నట్టు వెల్లడించారు. బాహుబలి2 తర్వాత సినిమాలు చేయనన్నారు. కానీ మధ్యలో సైజ్ జీరో, నమో వేంకటేశ లాంటి రాఘవేంద్రరావు సినిమాలను ఒప్పుకొని చేశారు. గురువైన రాఘవేంద్రరావు కోరితే చేయకుండా ఉండలేకపోయారు. కానీ ఇప్పుడు ఇక చేయను రిటైర్ అవుతానని చెప్పారు..

అసలు నాకు బ్రెయిన్ లేకుండా గుడ్డిగా కథను నమ్మకుండా తీసిన ఎంతో మంది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించానని కానీ అప్పుడు డబ్బుల కోసమే చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. క్షణక్షణం చేస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ తనతో అన్నాడని.. చిన్న ప్రొడక్షన్లు, డబ్బుల కోసం ఏది పడితే అది ఒప్పుకోవద్దని చెప్పాడన్నారు. కానీ తన పెద్ద ఫ్యామిలీని పోషించడానికి డబ్బుల కోసం సినిమాలు ఒప్పుకొని చేశానని చెప్పారు.

అయితే కీరవాణిని ఎవరో డైరెక్టర్లు తిట్టారని ఫిలింనగర్ సమాచారం. బాహుబలి 1 సినిమాతో పోల్చితే రెండో భాగంలో ఒక్క పాట మినహా వేరే పాటలు బాగా లేవు. దీంతో కీరవాణి పని అయిపోయిందని.. కొందరు విమర్శించారట.. దీంతో దానికి మనస్తాపం చెంది ట్విట్టర్ వేదికగా తన ప్రస్థానం.. తాను ఎదగడానికి చేసిన పనులను ఇలా ఆవేదనగా రాసుకొచ్చారు.

To Top

Send this to a friend