తెలంగాణలో వేలు పెట్టొద్దు మోడీజీ..

‘దేశంలో ఎక్కడైనా వేలుపెట్టండి. కానీ మిత్రపక్షంగా కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్తిరపరచొద్దు.. తెలంగాణలో అనవసర రాద్ధాంతం చేయొద్దు.. జర మీ అమిత్ షాకు ఈ విషయంలో మీరే చెప్పండి.. ’ అని సీఎం కేసీఆర్ సుతిమెత్తగా.. అమిత్ షాపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చామని ఎవరూ ఏ కుట్ర చేసినా తెలంగాణలో మాత్రం మేం ఊరుకోమని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి ఒకింత ఉద్వేగంతో కోరినట్టు తెలిసింది..

ఇటీవల అమిత్ షా తెలంగాణ పర్యటనలో రాష్ట్రానికి కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందని విమర్శించడం .. దానికి కౌంటర్ గా సీఎం కేసీఆర్ లక్ష కోట్లు ఎక్కడివి.. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.52 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే.. కేవలం రూ.25వేల కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయని.. లెక్కలతో సహా వివరించిన సంగతి తెలిసిందే..

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనుకుంటున్న బీజేపీ ఆశలు తెలంగాణలో నెరవేరవరని.. తెలంగాణలో అత్యధికంగా ఉన్న ముస్లింల వల్ల బీజేపీ గెలవదని.. అదే ఏపీలో తక్కువగా ఉన్న ముస్లిం జనాభా వల్ల ఏపీలో ప్రయత్నిస్తే బీజేపీ గెలిచే చాన్స్ ఉందని మోడీకి కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. మొత్తంగా మోడీకి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో గట్టిగానే తెలంగాణలో వేలు పెట్టొద్దని చెప్పినట్టు సమాచారం. మీకు అన్ని విషయాల్లో మద్దతు ఇస్తున్నామని.. అలా అని మమ్మల్ని అలసుగా చూడొద్దని కేసీఆర్ కోరినట్టు సమాచారం.

To Top

Send this to a friend