పడుకున్న సింహాన్ని జట్టు పట్టి లాగితే..

తన దాకా వచ్చే దాకా కేసీఆర్ ఓపిక పట్టాడు. ఎందుకంటే కేంద్రంతో కొట్లాడితే నిధులు రావు.. అందుకే సంయమనం.. కానీ తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే సరికి కేసీఆర్ లోని ఇగో దెబ్బతింది. కేంద్రం గీంద్రం జాన్త్ నై.. అనుకున్నాడు. తెలంగాణ , టీఆర్ఎస్ ప్రయోజనాలే ముఖ్యం అని బీజేపీ దుమ్ము దులిపేశాడు.. నల్గొండ జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వచ్చి కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఉతికి ఆరేశాడు.

అమిత్ షా స్థానిక బీజేపీ నేతలు చెప్పిన మాటలు విని తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని నోటి మాటగా చెప్పాడు. కానీ కేసీఆర్ అన్ని లెక్కలు, పత్రాలతో అమిత్ షా చెప్పినవి మాయ మాటలు అని నిరూపించాడు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పి బీజేపీ బండారం బయటపెట్టాడు.

అసలు కేంద్రం తెలంగాణకు ఇచ్చినవి అన్ని రాష్ట్రాలతో పాటు రాజ్యాంగబద్ధంగా వచ్చినవేనని.. అడిగిన దానికన్నా తక్కువే ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్ర నడవడం లేదని.. తెలంగాణ ఇచ్చిన నిధులతోనే కేంద్రం నడుస్తుందన్న విషయాన్ని కేసీఆర్ లెక్కలతో వివరించడం సంచలనంగా మారింది. 2016-17లో తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి 50 వేల కోట్లు చెల్లించిందట.. అదే కేంద్రం అదే సంవత్సరంలో 24.5 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలో కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం 67390 కోట్లు మాత్రమేనని కేసీఆర్ లెక్కలు చూపించారు. దేశాన్ని పోషించే అత్యధిక ఆదాయం ఇచ్చే ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.

ఒక్కటి మాత్రం నిజం.. కేసీఆర్ తనను విమర్శిస్తే సహిస్తాడు కానీ తెలంగాణపైన ఎవ్వరు విమర్శించినా సహించడని మరోసారి నిరూపించారు. మోడీతో, కేంద్రంతో ఎంత సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న కేసీఆర్ తెలంగాణలో పాగావేయాలని స్కెచ్ వేసిన బీజేపీని ఊరికే వదిలేయలేదు. అది బంగారు కత్తి అయినా మెడకోసుకోనని స్పష్టం చేశాడు. బీజేపీతో ఫైట్ కే రెడీ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఒక్క సీటు రాదని సర్వే ఫలితాలు చెప్పాడు.

సావధానంగా కేంద్రంతో వ్యవహరించాలని కేసీఆర్ చూశాడు. అందుకే మోడీ అంటే గౌరవమిని .. అమిత్ షాను మాత్రం కడిగేశాడు. పడుకున్న సింహాన్ని అమిత్ షా జుట్టు పట్టి లాగాడు మరీ. ఇప్పుడు కేసీఆర్ అన్నీ పక్కనపెట్టేశాడు. బీజేపీతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాంగ్రెస్ , టీడీపీనే ముప్పుతిప్పలు పెడుతున్న కేసీఆర్ కు బీజేపీ ఓ లెక్క కాదు. అందుకే లెక్కలు, పత్రాలతో నిరూపించి అమిత్ షా ను కడిగిపారేశాడు.. కేసీఆర్ తలుచుకుంటే బీజేపీ నేతలు నిలవలేరు. కేసీఆర్ తో పెట్టుకుంటే అంతిమంగా బీజేపీకే నష్టమని మరోసారి నిరూపితమైంది..

To Top

Send this to a friend