ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రధానంగా నష్టపోయేది ఏపీ ప్రజలు!

ఆ… ఎక్కడో చిన్న వార్త.. పెద్దపల్లి జిల్లా టాబ్లాయిడ్ లో మంథని డేట్ లైన్ తో వార్త.. ఆ జిల్లావరకే పరిమితం.. పక్క జిల్లావాళ్లు చూడలేరు..అంతచిన్న వార్త మనకెందుకు అని మీరు భావిస్తున్నారా..? కానీ అదే ఇప్పుడు ఏపీకి, అక్కడి ప్రజలకు శరాఘాతం.. నమ్మశక్యంగా లేదా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహచతురతకు నిదర్శనమీ వార్త.. ఆయన దూకుడు, స్పీడు, ఎవ్వరికీ తెలియకుండా ఎంత గుట్టుగా పనులు చేస్తాడో వివరించే వార్త ఇదీ..

మన చంద్రబాబు ఉన్నాడు.. ఆర్భాటపు చక్రవర్తి.. పోలవరం మొదలు పెడితే.. పూర్తి చేస్తే.. మొత్తం అంతర్జాతీయ మీడియా ఏపీలో దిగాలి.. చక్రవర్తిలాగా పూజలు, పునస్కారాలు, డబ్బా కొట్టుకోవడాలు .. అబ్బో బాబుగారీ ఠీవీనే వేరయా అనేలా ప్రచార ఆర్భాటాలు.. కానీ పక్కరాష్ట్రం సీఎం కేసీఆర్ చూడు.. ఎలాంటి చప్పుడు లేకుండా ప్రచార ఆర్భాటాలకు దూరంగా తెలంగాణ ప్రజల తాగు, సాగు నీటి కష్టాలు తీర్చే ప్రాజెక్టులను ఎంతసైలెంట్ గా పూర్తి చేస్తున్నాడో.. అవి పూర్తయితే ఏపీకి నీళ్లే రావు.. పోలవరం నిండదు. వట్టిసీమ వట్టిపోతుంది. చంద్రబాబు ఆర్భాటాలకు, కేసీఆర్ సైలెంట్ కు బాగా కుదిరిందబ్బా..

అసలు వార్త ఏంటంటే.. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు కడుతున్నారు. మొన్ననే సుప్రీంకోర్టు , గ్రీన్ ట్రిబ్యూనల్ అనుమతులు ఇచ్చింది. అప్పుడే పనులు సగం వరకు పూర్తయ్యియి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు.. పనులు మాత్రం జెట్ స్పీడులా జరిగిపోతున్నాయి. కనీసం ఇక్కడికి కేసీఆర్ వచ్చి చూసింది లేదు. అంతా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ కనుసన్నుల్లో చాలా గుట్టుగా ప్రాజెక్టులు రెడీ అయిపోతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజీ పనులు చకచక అయిపోతున్నాయన్నది వార్త.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రధానంగా నష్టపోయేది ఏపీ ప్రజలు, సీఎం చంద్రబాబు.. లాభపడేది తెలంగాణ ప్రజలు, కేసీఆర్.. తరతరాల నీటిగోసను తీర్చడానికి కేసీఆర్ నయీం ఎన్ కౌంటర్ లా గుట్టుగా ప్రాజెక్టులు కడుతున్నాడు. దానికి పబ్లిసిటీ చేయించుకోవడం లేదు. ఎందుకంటే ప్రచారం జరిగితే ఏదో అడ్డుపుల్ల. ప్రాజెక్టులు ఆగిపోతాయి. అందుకే మూడో కంటికి తెలియకుండా పూర్తి చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఏపీకి నీటి లభ్యత తక్కువవుతుంది. పోలవరంకు కష్టమే.. కేసీఆర్ చేసేవి ఎంత సైలెంట్ గా ఉంటాయనేదానికి తెలంగాణలో పూర్తవుతున్న ప్రాజెక్టులే పెద్ద ఉదాహరణ..
సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై జిల్లా సంచికల్లో ప్రచురితమైన కథనం కింద చూడొచ్చు..

To Top

Send this to a friend