కేసీఆర్ గుట్టు రేవంత్ చేతిలో..

బాంబు పేల్చేందుకు రేవంత్ రెడీ.. పత్రికాధిపతి రాయబారం..ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చి అభాసుపాలు చేసిన కేసీఆర్ పై ప్రతికారం తీర్చుకోవాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కసి గా ఉన్నారు. ఇప్పుడు ఆయన వెతకాల్సిన తీగ కాలికి తగిలినట్టు ఓ భారీ కుంభకోణం ఆధారాలు రేవంత్ చేతికి చిక్కాయట.. ఈ కుంభకోణం బయటపెడితే టీఆర్ఎస్ లోని ఓ మంత్రి, ఎమ్మెల్యేకు, కేసీఆర్ కు కూడా అప్రతిష్ట ఖాయమని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్.. వెంటనే రేవంత్ కు సన్నిహితుడైన తెలుగులోని ఓ ప్రధాన పత్రిక యజమానిని రాయబారానికి పంపినట్టు విశ్వసనీయ సమాచారం.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో జరిగిన భారీ భూ కుంభకోణం వెనక ‘బడా బాబులు’ ఉన్నారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి ఆధారాలు చిక్కినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయట పెట్టేందుకు రేవంత్ రెడీ అయినట్టు తెలిసింది.. సహజంగా ఇందులో పాలుపంచుకున్న వాళ్ళకు ఆ విషయం ఎలాగూ తెలుస్తుంది కదా?. అందుకే ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ రేవంత్ రెడ్డితో ‘రాయభారం’ మొదలు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

తెలుగులో ఓ ప్రముఖ మీడియా అధిపతి ఈ రాయభారం నడపగా..అందుకే రేవంత్ రెడ్డి ససేమిరా అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా పట్టుపట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మియాపూర్ తోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేల కోట్ల రూపాయల భూ స్కామ్ ఓ పెద్ద అస్త్రంగా దొరికింది. అందుకే ఆయన పూర్తి స్థాయిలో ఆ అంశంపై ఫోకస్ పెట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోరు మీదున్నారు.

ఈ వివరాలు అన్నీ ఆధారాలతో సహా బయటికి వస్తే కొంత మంది పెద్దలకు ఖచ్చితంగా ఇబ్బంది కలగటం ఖాయం. అందుకే మధ్యవర్తిగా ఓ మీడియా అధినేత రంగంలోకి దిగగా…ఈ విషయంలో మాత్రం రేవంత్ ససేమిరా అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే గతంలో తనను రాజకీయంగా అంతం చేసేందుకు కేసీఆర్ సర్కారు టార్గెట్ చేసి ఇరికించారని అభిప్రాయంతో ఉన్న రేవంత్..ఈ మియాపూర్ భూ స్కామ్ ను ఓ ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన ఆయన రాబోయే రోజుల్లో వీటిని బహిర్గతం చేయనున్నారని సమాచారం. మొత్తానికి మియాపూర్ స్కామ్ రాజకీయంగా రాబోయే రోజుల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. రేవంత్ రెడ్డి మాత్రం ఈ భూ స్కామ్ విషయంలో నేరుగా సీఎం ఫ్యామిలీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి రేవంత్ దగ్గర పలు ఆధారాలు ఉన్నట్లు సమాచారం.

To Top

Send this to a friend