కేసీఆర్.. ‘పవర్’ పాలిట్రిక్స్..


ఓ వైపు భానుడి భగ.. భగ.. మరోవైపు కరెంటు కోతలు తెలంగాణలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేసీఆర్ సర్కారు కంరెంట్ కొంటున్నాం.. అందిస్తున్నాం అని పైకి గంభీరంగా చెబుతున్న గ్రామాలు, పట్టణాలు నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో అప్రకటిత కరెంటు కోతలు జనాల్ని అతలాకుతలం చేస్తున్నాయి.

కరీంనగర్, వరంగల్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గ్రామాల్లో అప్రకటితంగా కోతలు విధిస్తున్నారు. పగటి పూట 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఏదో కారణం చెప్పి కరెంటు కోత విధిస్తున్నారు. పైకి మిషన్ భగీరథ అని.. లేదా.. చెట్ల కొమ్మలు కొట్టేయడం అంటూ.. లేదా మరో కారణం చెబుతూ దీనిపై పేపర్లో ప్రకటనలు ఇస్తూ కరెంట్ ను తీసేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఎక్కడా ఏ పని జరగడం లేదు. కానీ కరెంట్ కొరతను దాచి ఏదో తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా సరఫరా చేస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు.

కరెంట్ విషయంలో జనంతో, మీడియాతో కేసీఆర్ సర్కారు దొంగ నాటకాలాడుతోంది. సరిపడా కరెంట్ లేకున్నా 24 గంటలు కరెంట్ అందిస్తున్నామంటూ అబద్ధమాడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో అనధికారికంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతలు అనివార్యంగా మారాయి. దీనికి వేర్వేరు కారణాలు చెబుతూ కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. 45 డిగ్రీలకు చేరిన ఎండలకు ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు ఎండలకు తల్లడిల్లి చెమటలు కక్కుతున్నారు. కరెంటు విషయంలో దోబూచులాడుతున్న ప్రభుత్వ వైఖరిపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు.

To Top

Send this to a friend