జర్నలిస్టుల్లో ఉత్తములే వీరేనయ్యా.. ఇది కేసీఆర్ లెక్కయ్యా..

సబ్ ఎడిటర్లు.. అసలు వీరి శ్రమ వెలకట్టలేనిది.. తెరవెనుక వీరే వార్తను తీర్చిదిద్ది అందంగా ప్రజెంట్ చేస్తారు. కానీ వీరెవరికి పేరు రాదు.. అవార్డులు రివార్డులు రావు.. ఓ పెద్ద విలేకరి వార్త ఎంతగా చెత్తగా రాసినా సరే.. దాన్ని బాగా తీర్చిదిద్ది అందంగా అవుట్ పుట్ ఇస్తారు సబ్ ఎడిటర్లు.. అలాంటి వారికి ఇప్పుడు గుర్తింపు కరువైంది.. చెత్తగా వార్తలు పంపే రిపోర్టర్లకే పదవులు , అవార్డులు, రివార్డులు.. వస్తున్నాయి. వెనుక శ్రమకోర్చే అసలైన జర్నలిస్టులైన సబ్ ఎడిటర్లు, వీడియో ఎడిటర్లపై చిన్నచూపు కనిపిస్తోంది..

తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డుల ప్రకటన చూస్తే అందులో ఏ ఒక్క జర్నలిస్టు కష్టపడి వార్త రాసి.. దాన్ని తీర్చిదిద్దిన వారు కాదు.. కేవలం తెరముందు సబ్ ఎడిటర్లు రాసిన ఇచ్చిన దాన్ని తామే రాసామని గొప్పలు చెప్పుకున్న వారే… కొందరు వార్తలు రాయకుండా కింద వాళ్లతో వార్తలు రాయించి తమ పేరుమీద పంపించే విలేకరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికే అవార్డులు ప్రకటించడంపై సీనియర్ జర్నలిస్టులందరూ ఆశ్చర్యపోతున్నారు..

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ జర్నలిస్టు ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నాడు. అతడు ఏజ్ లో పెద్దోడు.. వార్తలు సరిగ్గా రాయరాదు.. వారి ప్రతిక డెస్క్ నుంచి రోజు తిట్లు తింటాడు. చాట భారతం రాస్తాడు. ఆయన కింద ఉండే మండల విలేకరులు రాసి ఇస్తే ఆయన పేరు మీద పత్రికాఫీసుకు వార్తలు పంపిస్తాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం అతడికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఇచ్చింది.. ఎందుకయ్యా అంటే అతడు ప్రభుత్వ విప్ కు అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘానికి పెద్ద దిక్కు. అందుకే అతడికి ఉత్తమ జర్నలిస్టుగా నాయకులు ఫ్రివర్ చేయడం కేసీఆర్ ఓకే చేయడం జరిగిపోయింది..

ఈ ఒక్క ఉదాహరణ కాదు.. అస్సలు జర్నలిస్టులకు టీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వలేదు. వీ6 న్యూస్ లో వచ్చే తీన్మార్ ప్రోగ్రాం యాంకర్ లిద్దరూ.. నిజంగా చెప్పాలంటే జర్నలిస్టులు కాదు.. వారు న్యూస్ ప్రజెంటర్లు మాత్రమే.. తెరవెనుక ఎంతో కష్టపడి స్క్రిప్ట్ సిద్దం చేసి ఇచ్చే సబ్ ఎడిటర్లకు ఆ అవార్డు ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం యాంకర్ సావిత్రి, బిత్తిరి సత్తికి అవార్డులు ప్రకటించడం విస్మయం కలిగించింది. తెరవెనుక ఎంతో బాగా తీన్మార్ ప్రోగ్రాంకు స్క్రిప్ట్ ను సిద్దం చేసే అసలైన వారిని వదిలేసి ఇలా కొసరు ప్రజెంటర్లకు అవార్డులు ఇవ్వడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ ఒక్క ఉదాహరణే కాదు.. జర్నలిస్టుల అవార్డుల్లో స్పోర్ట్స్ ,వాణిజ్యం, బిజినెస్, డెస్క్, రైతు, మ్యాగజైన్.. ఇలా పదుల సంఖ్యలో జర్నలిస్టులను కేటగిరిలుగా విభజించడం కూడా వివాదాస్పదమైంది. అసలు జర్నలిస్టుకు నిర్వచనం అంటే ‘జాక్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్..’ అన్ని వార్తలు రాయాల్సిందే. అలాంటి వాళ్లను విభజించి ఇలా అవార్డులు ప్రకటించడం ప్రస్తుతం జర్నలిస్టు మిత్రులను కలవరపాటుకు గురిచేస్తోంది.

To Top

Send this to a friend