కేసీఆర్ సర్వేపై సామాన్యుల స్పందన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ తరపున ఒక సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 111 సీట్లు సాధించడం ఖాయం. ఆ విషయాన్ని స్వయంగా కేసీఆర్‌ వెళ్లడి చేశారు. సర్వే ఫలితాలను వెళ్లడి చేస్తూ, ఎమ్మెల్యేలకు రేటింగ్‌ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు సాధించిన పాయింట్లను కేసీఆర్‌ వెళ్లడి చేశాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కేసీఆర్‌ చేయించిన సర్వే గురించి మాట్లాడుకుంటున్నారు.

పార్టీ నాయకులు మరియు కార్యకర్తల విషయాన్ని పక్కన పెడితే కొందరు సామాన్యలు కూడా కేసీఆర్‌ చేయించిన సర్వే ఫలితాలు నిజం కాక పోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం యువత ముఖ్యంగా నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి ఇప్పటి వరకు సరైన నోటిఫికేషన్స్‌ జారీ కాలేదు. మూడు సంవత్సరాల్లో యువతకు చేసింది ఏమీ లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్ల కొందరికి మాత్రమే లాభం చేకూరింది. రైతులు కూడా రుణ మాఫి ఒకేసారి అందక పోవడం వల్ల ఇబ్బందులు పడ్డారు.

ఈ కారణాల వల్ల ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ ఖచ్చితంగా గెలుపొందడం అసాధ్యం అని, అయితే ఎన్నికల సమయం నాటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయని, ఈ రెండు సంవత్సరాల్లో నిరుద్యోగుల కోసం భారీగా ఉద్యోగాలు వేయడంతో పాటు, రైతులను ఆకర్షించేందుకు కొత్త పథకాలు తీసుకు రావచ్చని, అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందుతుందని సామాన్యులు అంచనా వేస్తున్నారు.

To Top

Send this to a friend