ఉద్యమకారుడి రుణం తీర్చుకున్న కేసీఆర్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు తన ఇంట్లో పండుగలు పబ్బాలకు స్వస్తి చెప్పాడు. ఉద్యమంలో భాగంగా ఎన్నో సార్లు అమరణ దీక్షలు , పాదయాత్రలు చేశాడు. అంతేకాదు తెలంగాణ ఏర్పడే వరకు అరగుండు, అరమీసంతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాడు. టీఆర్ఎస్ బహిరంగ సభ ఏదైనా కానీ పేద గిరిజన రైతు దారవత్ మోహన్ గాంధీ అందరికంటే ముందే వెళ్లి పాల్గొనేవాడు. తెలంగాణ ఉద్యమానికే జీవితాన్ని అంకితం చేసిన మోహన్ గాంధీకి సీఎం కేసీఆర్ ఇప్పుడు సరైన గుర్తింపునిచ్చాడు. ఆయనను తెలంగాణ రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమాన్నే ప్రాణంగా భావించి పోరాడిన ఈ ఉద్యమకారుడికి ఇప్పుడు సముచిత గౌరవం లభించింది..

వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్నితాండా నుంచి వచ్చిన ఈ గిరిజన రైతు టీఆర్ఎస్ కే జీవితం అంకితం చేశాడు. టీఆర్ఎస్, కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపులో పాల్గొని అరగుండు, అరమీసంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇప్పుడు ఆయన చేసిన పోరాటానికి కేసీఆర్ మెచ్చి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టును కట్టబెట్టడం విశేషం..

తెలంగాణ ఏర్పడ్డ తరువాత అరగుండు, అరమీసం దీక్షను మోహన్ విరమించారు. కేసీఆర్ స్వయంగా పాల్గొని దీక్షను విరమింపచేసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ కోసం జీవితం ధారపోసిన మోహన్ కు అన్నీ విధాలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఈ ఉద్యమకారుడికి రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి సరైన గుర్తింపునిచ్చాడు. మోహన్ నియామకంపై ఉద్యమకారులు, గిరిజన నేతలు , కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుడికి సరైన గుర్తింపు లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు.

To Top

Send this to a friend