కేసీఆర్ సారూ.. నువ్వు వద్దు.. నీ గొర్రెలు వద్దయ్యా..

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పథకం కొన్ని చోట్ల అభాసుపాలైంది. మంత్రులు, అధికారుల ఉత్సాహం బాధితులకు పెను శాపంగా మారింది. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ప్రారంభించారు. మంత్రి తలసాని, అధికారులు చేసిన నిర్వాకం వల్ల కర్ణాటకలో అనాజ్ పూర్ గొర్రెల కాపారులు చిక్కుబడి పోయారు. కర్ణాటకలోని గొర్రెల యజమానులు ఇక్కడి వారిని బంధించారు.

రంగారెడ్డి జిల్లాలో మంత్రి తలసాని గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవానికి గొర్రెల యూనిట్ల కోసం అధికారులు అనాజ్ పూర్ అనే గ్రామ గొర్రెల రైతులతో కలిసి పక్క రాష్ట్రం కర్ణాటకకు వెళ్లారు. అక్కడ 120 గొర్రెలను కొనుగోలు చేశారు. అక్కడ మంత్రి ప్రోగ్రాం లేట్ అవుతుందని గొర్రెల కాపరులను వదిలి పెట్టి గొర్రెలను వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకొనిపోయారు. ఆ డబ్బులను మాత్రం చెల్లించలేదు. దీంతో అధికారులతో పాటు వెళ్లిన అనాజ్ పూర్ కాపరులను కర్ణాటక గొర్రెల యజమానులు బంధించారు. మాకు గొర్రెలు వద్దు.. ఇంటికి పంపండి అని అనాజ్ పూర్ వాసులు మొత్తుకుంటున్నారు. నాలుగు రోజులుగా నరకం అనుభవిస్తున్న గొర్రెల కాపారులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

అనాజ్ పూర్ గ్రామానికి ప్రభుత్వం 34 గొర్రెల యూనిట్లు మంజూరు చేసింది… ఇందుకోసం 300 గొర్రెలు అవసరం. వాటిని పక్కరాష్ట్రం కర్ణాటకలోని ఒక ఊరిలోంచి సేకరించేందుకు లబ్ధిదారులతో కలిసి అధికారులు ఒక బస్ తీసుకొని కర్ణాటక వెళ్లారు. గొర్రెలను కొని అధికారులు డబ్బులు చెల్లించకుండా పోయారు. దీంతో అనాజ్ పూర్ వాసులు 15 మందిని డబ్బులు చెల్లించాలని కర్ణాటక యజమానులు బంధించారు.. కర్నాటక రాష్ట్రంలో చిక్కుకుపోయిన గొర్రెల కాపారులు.. నాలుగు రోజులుగా తిండిలేక పక్కరాష్ట్రంలో తిప్పలు పడుతున్నారు. మాకు గొర్రెలు వద్దు ఇంటికి పంపండి కేసీఆర్ సార్ అని వేడుకుంటున్నారు.

వారి బాధను వీడియో తీసి సోషల్ మీడియాలో వదలడంతో వైరల్ అయ్యింది.

To Top

Send this to a friend