శర్వానంద్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘శతమానంభవతి’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. ఉత్తమ ప్రజాధరణ పొందిన సినిమాగా కేంద్ర ప్రభుత్వం ‘శతమానంభవతి’ చిత్రానికి అవార్డు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపించింది.
‘శతమానంభవతి’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులను సత్కరించారు. ఉత్తమ చిత్రాలను మరిన్ని చేయాలంటూ నిర్మాత దిల్‌రాజుకు మెమొంటో అందించారు. ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన దిల్‌రాజుపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తుందని ఈ సందర్బంగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు టాలీవుడ్ నుండి రావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. కుటుంబ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఈ సినిమా ఉండటంతో గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా తీవ్రమైన ఒత్తిడి ఉన్నా కూడా మంచి కలెక్షన్స్‌ను సాధించి ఘన విజయం సాధించింది. అవార్డు రావడంతో దిల్‌రాజు అండ్ టీంకు మరింత సంతోషం దక్కింది.
