కేసీఆర్, చంద్రబాబు సలహ మేరకే మోడీ…!

ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ సంచలనమే.. ఎవ్వరికీ రిలీవ్ చేయకుండా  చాలా గుట్టు చప్పుడు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటి నోట్ల రద్దు నుంచి నేటి రాష్ట్రపతి ఎన్నిక వరకు అన్నీ అనూహ్యలే.. ఆయన నిర్ణయానికి ప్రతిపక్షాలు, జనాలు షాక్ తిన్నారు. కానీ మోడీ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు, కేసీఆర్ లు ఉన్నారని ఊదరగొడుతున్నారు. పత్రికల్లో , మీడియాలో  ఈ మేరకు విస్తృతంగా ప్రచారం జరగడం విస్తు గొలుపుతోంది..

మొన్నటి నోట్ల రద్దు తర్వాత.. తానే ప్రధాని నరేంద్రమోడీకి పెద్ద నోట్ల రద్దు చేయాలని మొదట్లో లేఖ రాశానని.. అందుకే మోడీ నిర్ణయం తీసుకున్నారని.. నోట్ల రద్దు క్రెడిట్ నాదేనని చంద్రబాబు ఘంటా బజాయించి చెప్పారు.

ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది.. ప్రధాని నరేంద్రమోడీ దళితుణ్ణి రాష్ట్రపతిని చేశారు. దాన్ని కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు తానే దళితుడిని రాష్ట్రపతిని చేయాలని కోరానన్నాడు. ఇప్పుడు మోడీ తొలుత ఫోన్ చేసి.. ‘కేసీఆర్ జీ.. మీ కోరిక మేరకే దళితుడిని రాష్ట్రపతిని చేశామని.. మద్దతివ్వాలని’ కేసీఆర్ ను కోరినట్టు వార్తలు వెలువడ్డాయి.

రాష్ట్రపతి, నోట్ల రద్దు నిర్ణయాల వెనుక కేసీఆర్, చంద్రబాబులున్నారన్న వార్తలు విస్తృతంగా వ్యాపించడం గమనార్హం. అయితే దేశాన్ని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చిన మోడీ సొంతంగా నిర్నయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీలో ఆయన్ను మేనేజ్ చేసే మొగాడు లేడు. అంతటి గొప్ప ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాలును కేసీఆర్, చంద్రబాబులో తమ ఖాతాల్లో వేసుకోవడంపై బీజేపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఈ విషయం మోడీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి..

To Top

Send this to a friend