కట్టప్పలా.. నువ్ కట్టు బానిసవే..

శ్రమ నీ ఆయుధం..
లాభాలు వాడి సొంతం..
నీ కండలు కరగాలి..
వాడికి సొమ్ములు దండిగా రావాలి..
నీ బొక్కలు విరగాలి..
వాడు శ్రీమంతుడు కావాలి..
నీ మూలుగులు కరగాలి
ఐశ్వర్యంతో వాడు తులతూగుతూ ఉండాలి
వాడు లాభాలు కళ్ల జూస్తే నీకు పైసా ఇవ్వడు
నష్టాలు వస్తే నీ జీతం నుంచి లాక్కుంటాడు
ఇదే అంతఃసూత్రం.. దోపిడీని అడగొద్దు
ధిక్కార స్వరాన్ని వినిపించొద్దు..
ఎందుకంటే వాడు యజమాని..
నువ్వు కట్టు బానిస..
నీ అవసరమే వాడికి ప్రాతిపదిక
చట్టాలూ వాడి చుట్టాలే..
పేరుకే అవి నిన్ను రక్షిస్తున్నట్టు ఉంటాయి..
వాస్తవములో వాడికి కాపలా కుక్కల్లా ఉంటాయి..
ఈ రోజు నీ రోజు..నువునుకున్నట్టు నీ రోజు కాదు..
365 రోజులూ విరామం లేక విశ్రాంతి లేక ఉన్న నీకు
ఓ సెలవు రోజు అంతే..
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం..
కార్మిక శక్తి మొత్తం యజమాని పీడితం..
అణచబడి, వేధించబడి, దు:ఖించబడుతున్న
శ్రామికులకు మే డే శుభాకాంక్షలు

To Top

Send this to a friend