కఠినాత్ములుగా మారుతున్నారు…


నిజం.. నిజంగానే మనిషి మాయమైపోతున్నాడు.. కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాలదన్నుతున్నారు కొడుకులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా చేసుకుంటున్న ఈ సంఘటనలు సభ్యసమాజంలో అప్యాయతలు, అనుబంధాలను మాయం చేస్తున్నాయి. డబ్బు మాయలో పడి కన్న తల్లి/తండ్రిని రోడ్డు పాలు చేస్తున్న కఠినాత్ములుగా కొడుకులు మారిపోతున్నారు..

మొన్నటికి మొన్న రాజన్స సిరిసిల్ల జిల్లాలో తండ్రి చనిపోతే వృద్ధురాలైన తల్లిని ఇంట్లోంచి గెంటివేసి కొడుకులు ఉన్న ఇంటికి పంచుకున్నారు. ఐదుగురు కొడుకులున్నా ఎవ్వరూ చెరదీయక పోవడం తో చెట్టుకింద పడి ఉన్న వృద్ధురాలిని చూసి పత్రికల్లో కథనాలు రావడంతో కలెక్టర్ స్పందించి ఆమె ఆశ్రయం కల్పించారు.

మంగళవారం కూడా మంచిర్యాల జిల్లాలో ఇలానే జరిగింది.. ఎంతో మందికి నీతులు చెప్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న హెడ్ మాస్టర్ తన 90 ఏళ్ల కన్నతల్లిని నిర్ధయగా భారంగా భావించి ఇంటి ఆవల వదిలేశాడు. కట్టుకునేందుకు వస్త్రాల్లేక, తిండి సరిగా పెట్టక ఇబ్బందులకు గురిచేశారు. వృద్ధురాలి ఆరోగ్యం విషమించడంతో బాల్కనీలో గచ్చుపైన వదిలేశాడు ఆ మూర్ఖుడు.. ఈ దారుణం చూడలేక చలించిన స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి వృద్దురాలిని ఆస్పత్రికి తరలించి హెడ్ మాస్టర్ ను, భార్యను జైలుకు పంపారు.

ఇక్కడే కాదు.. వరుసగా రెండు రాష్ట్రాల్లో తల్లులను, తండ్రిలను వదిలించుకుంటున్న కసాయి కొడుకుల దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పెళ్లాం, పిల్లలు అయ్యాక తల్లిదండ్రులను కాలదన్నుతున్న ఈ కాసాయి కొడుకులను చూసి ఆ ముసలి బతుకులు తల్లడిల్లిపోతున్నాయి.

To Top

Send this to a friend