జూన్ 30వ తేదిన “కథలో రాజకుమారి”

విభిన్నమైన టైటిల్ తో అందరినీ ఆకట్టుకొని, ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం ‘కధలో రాజకుమారి ‘ . మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరకు ప్రాంతం లో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. మేస్ట్రొ ఇళయరాజా గారు ఈ చిత్రానికి రెండు గీతాలను అందిస్తుండగా… “క్రిష్ణగాడి వీరప్రేమగాధ” సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలను అందించారు….ఈ పాటలను అరన్ మ్యూజిక్ ద్వారా త్వరలోనే మర్కెట్ లోకి విడుదల చేయుటకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంతకు ముందెన్నడూ తెలుగు తెరపై చూడని విభిన్నమైన క్యారక్టరైజేషన్ లో నారా రోహిత్ నటిస్తుండగా మరొక ప్రత్యేక పాత్రలో నాగ శౌర్య నటించారు…..వీరి ఇద్దరి మధ్యన జరిగే సన్నివేశాలు చిత్రానికి హైలెట్ గా వుండబోతాయి అని యూనిట్ వర్గాలు తెలిపాయి. నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్, ప్రబాస్ శ్రీను, రఘుబాబు, తనికెళ్ళ భరణి, శ్రీముఖి, చలపతిరావు, జెన్నీ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రం యొక్క షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 30 వ తారీకున రిలీజ్ చేయుటకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆరోహి సినిమా, అరన్ మీడియ వర్క్స్, శ్రీహాస్ ఎంటెర్ టైన్ మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సం యుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
సౌందర్య నర్రా, ప్రశాంతి, సుధాకర్ రెడ్డి, కృష్ణవిజయ్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ వర్మ సిరివూరి సమర్పకులు. ఈ విభిన్నమైన ప్రేమ కధా చిత్రానికి నరేష్ కె రాణా చాయాగ్రహణం వహిస్తుండగా, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చేస్తున్నారు.

To Top

Send this to a friend