చిత్రం పేరు: కాటమరాయుడు
నిర్మాణం : నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్
నిర్మాత: శరత్ మరార్
కథనం, దర్శకత్వం : కిశోర్ కుమార్ పార్థసాని (డాలి)
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్, అలీ, రావు రమేశ్, ప్రదీప్ రావత్, కమల్ కామరాజు, శివబాలీజీ, అజయ్, చైతన్యకృష్ణ
సంగీతం : అనూప్ రూబెన్స్
పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లారు. అందుకే ఆ ప్రభావం అతడి సినిమాలపై కూడా ఉంది. అలాంటి కథలనే పవన్ ఎంచుకుంటున్నారు. పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తమిళ హిట్ కథను తెలుగులో తీశారు. పవన్ స్టామినాకు తగ్గట్టు.. అందులో కొన్ని ఇష్యూలను టచ్ చేస్తూ.. సేవ, ప్రేమ, మెసేజ్ కలగలిపిన వీరమ్ కథను తెలుగులో పవన్ ‘కాటమరాయుడు’గా తీసి చూపించారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించిందా.? వారు ఏమనుకుంటున్నారు..? తెలుసుకోవాలనుకుంటే కథను పరిశీలించాల్సిందే..
కథ :
కాటమరాయుడు (పవన్) ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. ఈ గుణమే అతడికి ప్రత్యర్థుల్ని తయారు చేస్తుంది. పైగా ఈ హీరోకు ఆడవాళ్లంటే అస్సలు పడదు.. అందుకే కనీసం పెళ్లి చేసుకోకుండా ప్రేమలో పడకుండా ఒంటి జీవితమే గడుపుతుంటాడు. అయితే అతడి నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. అన్నకు పెళ్లి కాకుండా తమ్ముళ్లు చేసుకోవడం కుదరదు కనుక అన్నయ్యను ప్రేమలో దింపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అప్పుడే కాటమరాయుడి ఎదురింటికి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ తో పవన్ ప్రేమలో పడేలా తమ్ముళ్లు ప్లాన్ చేస్తారు. వీరిద్దరు ప్రేమించుకున్నాక ప్రేమ గురించి పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్ సొంతూరు కు బయలు దేరుతారు. అప్పుడు రైల్లో వీరిపై దాడి జరుగుతుంది. దీంతో కాటమరాయుడు తన వల్లే ఇందంతా జరిగిందని.. ఇకనుంచి గొడవలు వదిలేస్తానని హీరోయిన్ కు మాట ఇచ్చి తిరిగి ఇంటికి వస్తాడు. అసలు వీరిపై దాడి ఎందుకు జరిగింది.? హీరోయిన్ కు చంపాలనుకునే వారికి ఏం సంబంధం..? కాటమరాయుడు పవన్ ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాడనేది స్టోరీ..
విశ్లేషణ:
ఈ సినిమాల బలాల విషయానికి వస్తే పవన్ కల్యాణ్ యాక్షన్ సినిమాకు ప్రాణం పోసింది.. ప్రేమ సన్నివేశాలు బాగా వచ్చి చూసేలా చేస్తాయి. కాటమరాయుడి స్నేహితుడిగా అలీ ఇతరులతో వచ్చే కామెడీ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సెకండాఫ్ లో సాగదీయడం కొంచెం విసుగుతెప్పిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఈ సినిమా మొత్తం కాటమరాయుడు పవన్ పైనే ఆధారపడి నడించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మెలితిప్పిన మీసంతో పవన్ స్టయిల్, యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పవన్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా చూపించాడు. పంచెకట్టు, తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను మలిచిన తీరు అద్భుతం. జనసేనానిగా రాజకీయాల్లో ఉన్న పవన్ అందుకు తగ్గట్టు పలికిన కొన్ని రిలేటెడ్ డైలాగ్స్ కు ప్రేక్షకులు ఈలలు వేశారు. అలాగే కామెడీ కూడా అలీతో, శృతిహాసన్ తో కలిసి పండించడంలో పవన్ ఆకట్టుకుంటున్నాడు. ఇక రిటైర్డ్ జడ్జి పాత్రలో నాజర్ కానీ.. ముగ్గురు విలన్లు ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, రావు రమేశ్ లు చక్కడి అభినయాన్ని ప్రదర్శించి మెప్పించారు. పవన్ తమ్ముళ్లు, అలీ కామెడీ పండింది. కథ ఆద్యంతం ఫస్టాఫ్ ప్రేమ, సెకండాఫ్ బలమైన ట్విస్ట్ లు, యాక్షన్ డ్రామాతో ఆకట్టుకుంది. మొత్తం మీద పవన్ అభిమానులకు ఈ సినిమా విందు బోజనమే.. మరో హిట్ ఖాయమే..
apnewsonline.in రేటింగ్ : 3.50/5
