కాటమరాయుడు తొలిరోజు కలెక్షన్లు

శుక్రవారం రిలీజ్ అయ్యి దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రికార్డు కలెక్షన్లతో ఊపుఊపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో ప్రీమియర్ షోలు, తొలిరోజు ఆటకు ప్రేక్షకులు పోటెత్తారు. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు.. అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే 6లక్షల డాలర్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.. ఈ లెక్కన మూవీ తర్వలోనే వన్ మిలియన్ డాలర్ల మార్కు దాటి 2 మిలియన్ల డాలర్ల క్లబ్ లో చేరుతుందని చెబుతున్నారు.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు మూవీ 23.05 కోట్ల షేర్ సాధించినట్టు టాక్. ఇది తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి తర్వాత మూడో పెద్ద కలెక్షన్.. ఖైదీనంబర్ 150 మూవీ 23.28 కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉంది. ఉత్తరాంధ్రలోనే కాటమరాయుడు రూ.3 కోట్లు సాధించినట్టు టాక్.

కాటమరాయుడు కలెక్షన్లు..
నైజాం : 4.77 కోట్లు
సీడెడ్-2.98 కోట్లు
ఉత్తరాంధ్ర -3.01 కోట్లు
గుంటూరు – 2.97 కోట్లు
ఈస్ట్ గోదావరి – 3.56 కోట్లు
వెస్ట్ గోదావరి – 2.91 కోట్లు
కృష్ణ – 1.52 కోట్లు
నెల్లూరు – 1.33 కోట్లు

To Top

Send this to a friend