రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..


సినిమాల్లో చూస్తాం.. మొదట హీరో సైకిల్ తొక్కుతాడు.. ఆ తర్వాత బైక్.. కారు ఇలా ఓ పేద్ద బంగళా, కారు.. అది సినిమా కాబట్టి ఆనందిస్తాం.. అదే అచ్చం అలాగే నిజం జీవితంలో వస్తే అనుమానిస్తాం.. ఇక్కడ అదే డౌట్ ఓ కోటీశ్వరుడిని జైలు పాలు చేసింది..

శ్రీకాకుళంకు చెందిన ఓ సాదా మైనింగ్ వ్యాపారి, ఆయన కొడుకు వడ్డి మహేశ్ హవాలా రాకెట్ నడిపిస్తున్నారు. అలా డబ్బులు బాగా వచ్చిపడడంతో ఓ ఖరీదైన బెంజ్ కారును వడ్డి మహేశ్ ఇటీవలే కొనుగోలు చేశాడట.. దానికోసం ప్రభుత్వానికి పన్ను కట్టాడు. ఇలా పన్ను చెల్లించిన వడ్డి మహేశ్ గురించి ఐటీ అధికారులు ఆరాతీయగా.. ఆయనకు అంత స్థోమత లేదని తేలింది. మరి ఇంత డబ్బు ఎక్కడిది అని ఆరాతీస్తే హవాలా కుంభకోణం వెలుగుచూసింది..

వడ్డి మహేశ్ ఇటీవల కొనుగోలు చేసిన బెంజ్ కారు గురించి ఆరాతీస్తే అతడు చేసిన హవాలా వ్యాపారాలు ఐటీ అధికారులు పసిగట్టారు. మహేశ్ వివిధ బోగస్ కంపెనీలను సృష్టించి విదేశాల నుంచి కంప్యూటర్, సాఫ్ట్ వేర్ కొనుగోలు అంటూ హాంకాంగ్, చైనా, మలేషియా, బ్యాంకాక్ లకు ఇప్పటివరకు 1369 కోట్లు పంపాడట.. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇక్కడి వ్యాపారులు, బడా బాబుల నుంచి డబ్బు తీసుకొని కంపెనీల అవసరాలకు బ్యాంకులో వేసి విదేశాలకు డబ్బును ట్రాన్స్ ఫర్ చేయించాడట.. ఇలా పంపిన డబ్బులో కమీషన్ కింద భారీగా వసూలు చేశాడు. అన్ని కోట్లు అప్పనంగా రావడంతో బెంజ్ కారు కొన్నాడు. దానికి పన్ను కడుతూ ఐటీ అధికారుల విచారణలో వెలుగుచూసి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన వడ్డి మహేశ్ విషాదాంతం అందరినీ విస్మయానికి గురిచేసింది.

To Top

Send this to a friend