రగిలిన కాపు ఉద్యమం..

ఏపీ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీల అమలులో మోసం చేశాడని నిరసిస్తూ ముద్రగడ నివాసం నుంచి రాజధాని అమరావతికి ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముద్రగడను హౌస్ అరెస్ట్ చేశారు.

ముద్రగడ అరెస్ట్ కు నిరసనగా తూర్పు గోదావరి జిల్లాలో కాపు నేతలు, విద్యార్థులు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ పోలీసులు ఈ కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. ముద్రగడను కిర్లంపూడిలోనే అడ్డుకున్న పోలీసులు ఆయనను పాదయాత్రకు అనుమతి లేదంటూ గృహనిర్బంధంలో ఉంచారు. ఇక ఉద్యమించిన కాపు నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్ లు, ఆంక్షలు విధించారు.

ఈ పరిణామాలు మళ్లీ ఏపీలో వేడిని పెంచాయి. కాపు ఉద్యమం మరోసారి రగిలే ప్రమాదం ఉంది. చంద్రబాబు ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చి వెనుదిరగడంతో వ్యతిరేకత కొని తెచ్చుకున్నారు.. ఇప్పుడు మరో సారి స్తబ్ధుగా ఉన్న వాతావరణంలో ఈ కాపు ఉద్యమం రగిలితే ఇక ఏపీలో అల్లకల్లోలం కావడం ఖాయం.. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్తితుల్లో చంద్రబాబు ఉన్నారు ..

కిర్లంపూడిలో విలేకరులతో మాట్లాడిన ముద్రగడ పద్మనాభం చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. కాపుజాతికి స్వేచ్ఛ లేదు. నేను తీవ్రవాదిని కాదని.. నా పై కేసులు ఉంటే అరెస్ట్ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. శాంతియుత పాదయాత్రను చేస్తానని పోలీసులను చేతులు జోడించి వేడుకుంటున్నానని పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు.

To Top

Send this to a friend