కన్నడలో విడుదలవుతుందా?


బాహుబలి ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో సినిమా డైరెక్టుగా విడుదలవుతోంది. కన్నడలో మాత్రం సందిగ్ధం నెలకొంది. అందుకు కారణం కట్టప్ప పాత్రధారి సత్యరాజ్. ఆయన కావేరి జలాల వివాదంలో కన్నడిగులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయన నటించిన బాహుబలి సినిమాను కన్నడలో విడుదల చేసేది లేదని కన్నడ సంఘాలు అల్టిమేటం చేశాయి.

అయితే కట్టప్ప సత్యరాజ్ సారీ చెప్పడానికి వెనుకాడుతున్నారు. సారీ చెబితే సొంతరాష్ట్రం తమిళనాడులో విమర్శల పాలవుతారు. సినిమా విడుదల కోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినవారవుతారు. సారీ చెప్పకపోతే కన్నడలో బాహుబలి సినిమా విడుదల కాలేదు. దీంతో సినిమాకు దాదాపు రూ.50 కోట్ల నష్టం. సో ఈ వ్యవహారం ఎలా పరిష్కారం అవుతుందో తెలియక బాహుబలి యూనిట్ సతమతమవుతోంది..

బాహుబలి మొదటి పార్ట్ కన్నడలో విడుదలైంది. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఇందులో ఓ రాజు పాత్రలో తళుకున మెరిసారు. కన్నడలో బాహుబలి1 సినిమా దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. బాహుబలి2 సినిమా ఈసారి 60 కోట్లపైనే వసూళ్లు సాధిస్తుందని యూనిట్ నమ్మకంతో ఉంది. కానీ కట్టప్ప సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కన్నడ సంఘాల పట్టుతో కర్ణాటకలో చిత్ర ప్రదర్శించడం అనుమానంగా మారింది.

To Top

Send this to a friend