కమల్‌ ట్వీట్‌తో ఫ్యాన్స్‌ నిరాశ


యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సినిమాలు ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాయి. అయినా కూడా ఆయన అభిమానులు మాత్రం ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం పూర్తి అయ్యి విడుదలకు నోచుకోని ‘విశ్వరూపం 2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తతో ఫ్యాన్స్‌ అంతా సంతోషించారు.

‘విశ్వరూపం 2’ ట్రైలర్‌ విడుదల కాబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు అంటూ కమల్‌ హాసన్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. ప్రస్తుతం సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం నిజమే కాని, ట్రైలర్‌ విడుదలపై నిర్ణయం తీసుకోలేదని, సినిమాను బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలనుకుంటున్నామని, హక్కులను ఇంకా ఎవరికి ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

కమల్‌ ట్వీట్‌తో ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ‘విశ్వరూపం 2’ ట్రైలర్‌ వస్తుందని సంతోషిస్తున్న ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్‌ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన ‘విశ్వరూపం’ చిత్రంతో కమల్‌ హాసన్‌ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ సినిమా విడుదలకు అప్పటి తమిళ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఏదోలా సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ‘విశ్వరూపం 2’కు ఎలాంటి అడ్డంకులు వచ్చే అవకాశం లేదు. అయినా విడుదలకు ఇబ్బందులు వస్తున్నాయి.

To Top

Send this to a friend