కమల్‌ సక్సెస్‌.. ఇక ఎన్టీఆర్‌?


హిందీలో అత్యధిక ప్రేక్షకాధరణ ఉన్న రియాల్టీ షో బిగ్‌బాస్‌. పది సీజన్‌లు విజయవంతంగా నడిచిన ఈ బిగ్‌బాస్‌ షోను తెలుగు మరియు తమిళంలో అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్వహకులు సిద్దం అయ్యారు. గత కొన్ని వారాలుగా తమిళ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్‌ విజయ్‌ టీవీలో బిగ్‌ బాస్‌ షో గురించి విపరీతమైన ప్రచారం చేశారు. దాంతో తమిళ ఆడియన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ షోను డిజైన్‌ చేశారు. నిన్నటి నుండి విజయ్‌ టీవీలో ఈ షో ప్రారంభం అయ్యింది. మొదటి ఎపిసోడ్‌లో కమల్‌ హాసన్‌ ఆకట్టుకున్నాడు.

మొదటి ఎపిసోడ్‌లో భాగంగా కమల్‌ హాసన్‌ షోలో పాల్గొనబోతున్న వారిని పరిచయం చేశాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన వర్థమాన నటీనటులు ఎక్కువగా ఉన్నారు. ఇందులో తమిళ మరియు తెలుగు హీరోయిన్‌ అయిన నమిత కూడా ఉండటం విశేషం. నమిత బిగ్‌ బాస్‌ షోకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వహకులు భావిస్తున్నారు. కమల్‌ షో ప్రారంభం అయిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్‌ షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో పలువురు నటీనటులను ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend