‘కమల్ కు షార్ట్ టెంపర్ ఎక్కువ.. మీరంతా ఆయనలో కోపాన్ని 10శాతం మాత్రమే చూశారు. కానీ నేను కమల్ కోపాన్ని 100శాతం చూశాను. అందుకే కమల్ తో జాగ్రత్తగా ఉంటా.. కమల్ డబ్బు గురించి పట్టించుకోడు. అసలు తన వద్ద డబ్బు దాచుకోడు.. కమల్ వద్ద ఇప్పుడు కొంతైనా డబ్బు ఉందంటే అది ఆయన అన్నయ్య చంద్రహాసన్ చలువే.. కానీ ఇప్పుడు ఆయనే లేడు..’ అంటూ రజినీకాంత్ కమల్ హాసన్ లోని కోణాన్ని ఆవిష్కరించారు.
కమల్ హాసన్ అన్నయ్య చంద్రహాసన్ ఇటీవలే కన్నుమూశారు. ఈ సందర్భంగా చైన్నైలో నిర్వహించిన సంతాప సభలో కమల్ ఇప్పుడు ఇంత ఆర్థికంగా ఉండడానికి చంద్రహాసన్ అని.. కమల్ ను కంట్రోల్ చేసే వ్యక్తుల్లో బాలచందర్, అనంత్, చారుహాసన్, చంద్రహాసన్, ఈ నలుగురిలో ముగ్గురు చనిపోవటంతో కమల్ ఒంటరి అయ్యాడు. కానీ కమల్ కు తోడుగా మేమందరం ఉన్నాం’ అని రజినీకాంత్ చెప్పారు. దీంతో కమల్ ఉద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశారు.
రజినీ, కమల్ హాసన్ లు ఇద్దరు బాలచందర్ శిష్యులుగా ఒకేసారి తమిళం ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. కమల్ విలక్షణ పాత్రలతో గొప్ప నటుడిగా ఎదగగా.. రజినీ మాస్ హీరోగా పేరుసంపాదించుకున్నారు. తమిళ నాట క్రేజ్ విషయంలో ఇద్దరు ఇద్దరే.. ఇలా ఒకరినొకరు తమ అంతరంగాలను వేదికపై పంచుకోవడంతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.
