బాహుబలిని చూసేవారు గొర్రెలు?

ప్రపంచ వ్యాప్తంగా కూడా ‘బాహుబలి 2’ సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఇప్పటికే వసూళ్లు అయిన 1500 కోట్ల కలెక్షన్స్‌ను చూస్తుంటే బాహుబలి ఏ స్థాయి సినిమానో అర్థం చేసుకోవచ్చు. సినిమా విడుదల సమయంలో బాలీవుడ్‌ నటుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌ విమర్శలు చేసి, వచ్చిన కలెక్షన్స్‌ను చూసి షాక్‌ అయ్యి, చిత్ర యూనిట్‌ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు. బాహుబలి 2 ఒక గొప్ప సినిమా అంటూ ప్రశంసలు కురిపించాడు.

విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘బాహుబలి 2’ సినిమాపై తాజాగా యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. చిత్రంతో పాటు ఆ సినిమాను చూసే వారిపై కూడా కమల్‌ తనదైన శైలిలో విమర్శించాడు. తాజాగా ఒక మీడియా సంస్థకు కమల్‌ హాసన్‌ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మీరు ‘బాహుబలి 2’ సినిమాను చూస్తారా అంటూ ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా తాను ఏమీ గొర్రెను కాదు, గొర్రెల మంద కాపరిని అంత కంటే కాదు అంటూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు.

‘బాహుబలి 2’ సినిమాను ప్రేక్షకులు గొర్రెల మందల మాదిరిగా చూస్తున్నారన్నది ఆయన అభిప్రాయం. ఆ సినిమా సక్సెస్‌ అయినంత మాత్రాన తాను అలాంటి సినిమా చేస్తానంటూ ఉరుకులు పరుగులు పెట్టే రకం కాదు అంటూ కమల్‌ చెప్పుకొచ్చాడు. కమల్‌ చేసిన వ్యాఖ్యలు బాహుబలి చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులను కూడా కించ పర్చే విధంగా ఉన్నాయి. కమల్‌ వ్యాఖ్యలపై సినీ వర్గాల్లో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తనకు నచ్చినట్లుగా మాట్లాడే కమల్‌ హాసన్‌ ఇలాంటి వ్యాఖ్యలు గతంలో కూడా పలు సినిమాలపై చేశాడు.

To Top

Send this to a friend