కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌


శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’. కళ్యాణ్‌, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో మెగా బ్రదర్‌ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అనంతరం నటి కవిత తొలి సన్నివేశానికి క్లాప్‌ నివ్వగా నిర్మాత సాయివెంకట్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ప్రముఖ దర్శకులు సాగర్‌ ఈ చిత్రం తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర నిర్మాత టి. రామకృష్ణ మాట్లాడుతూ.. చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జూన్‌ మొదటివారం నుండి చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతోంది. విశాఖపట్నం, అరకు, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో మొదటి షెడ్యుల్‌ షూటింగ్‌ని ప్లాన్‌ చేశాము…అని తెలిపారు.
కళ్యాణ్‌, లక్ష్మీశిల్ప, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్‌, కవిత, విజయ్‌, వెంకటేష్‌ మరియు నూతన నటీనటులు నటించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌: జయసూర్య, ఎడిటింగ్‌: నందమూరి హరి, కెమెరా: మహిషర్ల, నిర్మాత: టి. రామకృష్ణ, దర్శకత్వం: సత్య.

To Top

Send this to a friend