పాపం కల్పన.. బిగ్ బాస్ లో ఆమె పరిస్థితి.

బిగ్ బాస్ లో ఇప్పుడు అందరి టార్గెట్ ఆమె అయ్యింది. ఈవారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ లో కల్పన మొదటి వరుసలో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియను వినూత్నంగా నిర్వహించారు. బిగ్ బాస్ కోరిక మేరకు నాలుగోవారం ఎలిమినేషన్ ప్రక్రియలో మొత్తం 11 మంది కంటెస్ట్ లకు తమలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాల్సిందిగా ఆదేశించారు. తలా రెండు ఫామ్ కప్ లను అందించి ఎవరిని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ముఖానికి ఈ ఫామ్ పూయాలని బిగ్ బాస్ ఆదేశించారు.

దీంతో దాదాపు సగం మంది కంటెస్టెంట్ కల్పనకు ఫామ్ పూసారు. ఆ తర్వాత మహేశ్ కత్తికి ఎక్కువమంది పూసారు. మూడో స్థానంలో దీక్ష, హరితేజ, శివబాలాజీలు ఉన్నారు. ఇక కెప్టెన్ అయినందుకు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి ఆదర్ష్ తప్పించుకోగా.. ధన్ రాజ్ ను ఎలిమినేషన్ చేయడానికి ఎవరూ ఫామ్ పూసి నామినేట్ చేయకపోవడం విశేషం..

ఇక కల్పనను అందరూ నామినేషన్ చేయడానికి గల కారణాలను విశ్లేషించారు. కల్పన రెండో వారంలో కెప్టెన్ గా ఉన్నప్పుడు చేసిన పొరపాట్లు, ఆమె ప్రవర్తన, హిట్లర్ టైం మెంటాల్టీ తమకు నచ్చలేదని అందరూ మండిపడ్డారు. ఆమెతో బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతున్నామని.. ఆమెను ఎలిమినేషన్ చేస్తే అందరికీ మంచిందని చెప్పారు.

To Top

Send this to a friend