కలిస్తే కష్టాలు దూరం..


అధికారంలో ఉన్నవాడు సవాలక్ష చేస్తాడు.. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇవన్నీ ఆక్షేపిస్తాడు.. తెలంగాణలో చంద్రబాబు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అప్పట్లో తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా కలుపుకొని కేసీఆర్ మంత్రిపదవులు ఇచ్చాడని.. ఇది అనైతికమని విమర్శించారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను కలుపుకొని చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటిచ్చారు. దీనిపై మాత్రం మాట్లాడడు.. ఎందుకంటే ఎవరి స్వప్రయోజనాలు వారివి. రేపొద్దున జగన్ అధికారంలోకి వచ్చినా టీడీపీని ఇలా చీల్చేస్తాడు. చంద్రబాబును ఆడుకుంటాడు. అప్పుడు చంద్రబాబు గగ్గోలు పెట్టడానికి లేదు..

ఇప్పుడు జగన్.. చంద్రబాబు బాగోతాన్ని బట్టబయలు చేయడానికి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ రాష్ట్రపతిని కలిసి చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపచేసి మంత్రి పదవులు ఇచ్చిన తీరును వివరించారు. అనంతరం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీని, టీడీపీని వ్యతిరేకించే వారందరితో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తీరును వివరిస్తానని చెప్పారు. ఓటుకు నోటు కోసం చంద్రబాబు బీజేపీకి సాగిలపడి ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీ వెళ్లి చంద్రబాబు పరువు తీసే ప్రయత్నాలు జగన్ ఎన్ని చేసినా కానీ జనబలం లేకపోతే ఏమీ కాదు.. ముందుగా జగన్ ఆ జనబలాన్ని బలమున్న పార్టీలను కలుపుకునే ప్రయత్నాలు చేస్తే మంచిది. వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దల ఆహ్వానాన్ని మన్నించి వారితో కలిస్తే ఏపీ సీఎం అవుతారు. అప్పుడు చంద్రబాబును.. అండ్ కోను నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు.. జగన్ చేయాల్సింది బీజేపీతో పొత్తే.. ఈ పొత్తు పొడవకుండా చంద్రబాబు టీం లాబీయింగ్ చేస్తోంది. జగన్ ను జైలుకు పంపించే ప్రయత్నాలు చేస్తోంది. తెలివిగా జగన్ బీజేపీ నేతలతో దోస్తీ కడితే ఆయనకు మంచిది.. రాజకీయంగా కూడా ఏపీలో లాభపడతారు.

To Top

Send this to a friend