కళాతపస్వీ కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్


తెలుగు దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సోషల్ మీడియాలో కే.విశ్వనాథ్ కు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొందరు స్వయంగా వచ్చి ఆయన విషెస్ చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కె విశ్వనాథ్ ఇంటికి వెళ్లి మరీ పుష్పగుచ్చం అందించి శుభాభినందనలు తెలియజేశారు. చిరంజీవి-కె.విశ్వనాథ్ ల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి స్వయం కృషి, ఆపద్భాంధవుడు లాంటి గొప్ప చిత్రాలు తీశారు. కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ రెండు చిత్రాలు చిరు నటనా జీవితంలోనే మేరునగలాంటివి. అందుకే చిరంజీవి స్వయంగా విశ్వనాథ్ ఇంటికి వచ్చి తన అభిమానం చాటుకున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం ఉదయం చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కె.విశ్వనాథ్ ను కలిశారు. పవన్ తో పాటు అతడి స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ వెంట వచ్చారు. ఇద్దరూ విశ్వనాథ్ ఇంటికి వెళ్లి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం, స్వీట్ ప్యాకెట్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనాథ్ దంపతులతో కాసేపు గడిపారు. ఇలా చిరు, వపన్ ఇద్దరూ విశ్వనాథ్ ను అభినందించడం విశేషం.

To Top

Send this to a friend