బి గ్రేడ్‌ హీరోయిన్‌గా మారిపోయిన కాజల్‌

 

నిన్న మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు ఆ క్రేజ్‌ను పోగొట్టుకుంది. ఇటీవలే మెగాస్టార్‌ వంటి స్టార్‌ హీరోతో ‘ఖైదీ నెం.150’ చిత్రం చేసినా కూడా ఆ సినిమా కాజల్‌కు ఉపయోగపడ్డది లేదు. మెగా మూవీ తర్వాత ఈమెకు మరో స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ దక్కలేదు. ఇక భవిష్యత్తులో కూడా కాజల్‌ స్టార్‌ హీరోలకు జోడీగా అవకాశం దక్కించుకుంటుందనే నమ్మకం లేదు. ఇకపై కాజల్‌ సెకండ్‌ గ్రేడ్‌ సినిమాలు, హీరోలతో చేయాల్సిందే అని తేలిపోయింది.

తన పరిస్థితి, తన ప్రస్తుత ఇమేజ్‌ను గుర్తించిన కాజల్‌ ఇకపై స్టార్‌ హీరోలతోనే చేస్తాను అని పట్టుబట్టి లేకుండా ఏ ఆఫర్‌ వస్తే ఆ ఆఫర్‌ను ఓకే చెప్పేస్తుంది. ఇప్పటికే రానాతో ‘నేనేరాజు నేనే మంత్రి’ చిత్రంలో నటించిన కాజల్‌ తాజాగా నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ నటించబోతున్న ‘ఎమ్మెల్యే’ అనే చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యింది. ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘క్వీన్‌’ అనే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి కూడా కాజల్‌ ఓకే చెప్పింది.

‘క్వీన్‌’ చిత్రాన్ని చాలా మంది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో పాటు, మళ్లీ గ్లామర్‌ హీరోయిన్‌గా అవకాశాలు రావేమో అనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను చేసేందుకు ముందుకు రాలేదు. అయితే కాజల్‌ ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ‘క్వీన్‌’లో నటించేందుకు ముందుకు వచ్చింది. ఇకపై కాజల్‌ బి గ్రేడ్‌ సినిమాలు మాత్రమే చేసే అవకాశాలున్నాయి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అక్క లేదా ఆంటీ పాత్రలను కాజల్‌ చేస్తుందేమో చూడాలి.

To Top

Send this to a friend