కలెక్టరమ్మకు కడియం కౌంటర్

వరంగల్ లోని ములుగు రోడ్డులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి నిరుద్యోగ యువతకు పలు సూచలను చేశారు. ‘జాబ్ మేళాలో కానీ ప్రభుత్వం ఉద్యోగంలో కానీ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి.. లేదంటే ఉద్యోగం రాదు. సర్టిఫికెట్లు, మార్కుల పరంగా కాకుండా.. పనిచేయగల సామర్థ్యం విషయంలో మీరు బద్దకస్తులైనా సరే బాగా పనిచేస్తామని అబద్ధాలాడాలని ’ అని అన్నారు. కలెక్టర్ మాటలకు స్టేజీ మీదున్న మంత్రులు కడియం శ్రీహరి, నాయినిలు అవాక్కయ్యారు. నిరుద్యోగులకు కలెక్టరమ్మ ఇచ్చే సందేశం ఇలా ఉందేమిటని ముక్కన వేలేసుకున్నారు.

అయితే తరువాత మైక్ అందుకున్న డిప్యూటీ సీఎం కడియం మాత్రం కలెక్టరమ్మకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం కోసం అబద్ధమాడి తరువాత జాబ్ లో చేరి పనిచేతకాకపోతే దొరికిపోతేరాని..తెలివిగల అధికారులనే ఎవరైనా ఉంచుకుంటారని.. అబద్ధాలాడి దొరికిపోతే వచ్చే ఉద్యోగం కూడా రాదని ’ హెచ్చరించారు.

కలెక్టర్ అమ్రపాలి వర్సెస్ మంత్రి కడియం లొల్లి హాట్ టాపిక్ గా మారింది. ఓ జిల్లా కలెక్టర్ అయ్యిండి నిరుద్యోగులను అబద్ధాలాడి ఉద్యోగాలు సంపాదించాలని సూచించిన కలెక్టర్ తీరును మంత్రి వేదికమీదే ఖండించడం సంచలనంగా మారింది. ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు ఇలా వేదికమీద విభిన్నంగా ఆడిపోసుకోవడంతో మీడియాలో హైలెట్ అయ్యింది.

To Top

Send this to a friend