కథ సిద్దం చేయమన్న రాజమౌళి


ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన ఫోకస్ అంతా బాహుబలి2 ప్రమోషన్ మీదే పెట్టాడు. ఆ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక కంప్లీట్ గా ఓ రెండు మూడు నెలలు సినిమాలు వదిలేసి హాలీడే ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తానని చెప్పాడు..

కానీ ఈ లోపే తన కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకు రాజమౌళి ఆదేశాలిచ్చాడట.. తాను వచ్చే 2 , 3 నెలల తర్వాత భేటి అవుదామని.. అప్పుడు చర్చించి కథను ఫైనలైజ్ చేస్తానని.. ఫలనా హీరోను దృష్టిలో ఉంచుకొని ఓ మంచి బాటమ్ లైన్ కథను సిద్ధం చేయాలని కోరాడట.. మీరందరూ సిద్ధం చేసిన కథను తాను ఫైనలైజ్ చేస్తానని రాజమౌళి చెప్పినట్టు సమాచారం. అంతేకాదు హీరో క్యారెక్టరైజేషన్ కు సంబంధించి కొన్ని హింట్స్, కూడా రాజమౌళి ఇచ్చినట్టు సమాచారం.

కాగా రాజమౌళి తన తరువాతి సినిమాను అయితే ఎన్టీఆర్ లేదా మహేశ్ తో చేయడానికి రెడీ అయినట్టు తెలిసింది. మహేశ్ తో అయితే కౌబాయ్ కథను.. ఎన్టీఆర్ కోసం ఓ కమర్షియల్ చిత్రాన్ని రెడీ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఏ హీరో అయినా వచ్చే సినిమాలో గ్రాఫిక్స్ వినియోగించకుండా నాచురల్ గా తీయాలనే పట్టుదలతో రాజమౌళి ఉన్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend