కాబోయే భర్తను ఆ పరీక్షకు


పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఓ ట్రక్ డ్రైవర్ కుమార్తె సునీతా సింగ్ కి వివాహం నిశ్చయమైంది. ఈమెకు జస్ ప్రీత్ సింగ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఇందుకోసం గురుద్వారాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వరుడి కాళ్లు కారు దిగుతుండగానే తడబడ్డాయి. అది గమనించిన పెళ్లి కూతురు సునీత అతడు ఏదో మందు కానీ, డ్రగ్స్ కానీ తీసుకున్నాడని గుర్తించింది. నిలదీయగా.. కాలుకు దెబ్బ తగిలిందని వరుడు అబద్దమాడాడు. అయినా ఒప్పుకోని పెళ్లికూతురు పెళ్లికొడుకు వైద్య పరీక్షలు చేసుకుంటేనే చేసుకుంటానని కండీషన్ పెట్టింది..

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పెళ్లి కొడుకు తనకు ఇష్టం లేకున్నా వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో వరుడు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఆ పెళ్లి కూతురు ఇతగాడిని చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో పాటు డ్రగ్స్ తీసుకున్నందుకు వరుడు జైలు పాలయ్యాడు.

ఈ ఘటనలో ధైర్యసాహాసాలు ప్రదర్శించిన పెళ్లి కూతురిని బంధువులు, పోలీసులు ప్రశంసలతో ముంచెత్తగా.. వరుడు బంధువులు మాత్రం ఆడిపోసుకున్నారు. పంజాబ్ లో ప్రభుత్వం డ్రగ్స్ పై నిషేధం విధించినా అక్కడ యువత మాత్రం ఇలా విచ్చలవిడిగా తీసుకుంటుండడం నిత్యకృత్యంగా మారింది.

To Top

Send this to a friend