బిగ్ బాస్ లో కేఏపాల్

వివాదం ఉంటేనే ఏ ప్రోగ్రాం అయినా హిట్ అవుతుంది. ఎంత మసాలా.. ఎంత కాంట్రవర్సీ ఉంటే ఆ కార్యక్రమాలు అంతలా హిట్ అవుతున్న రోజులివి అందుకే కాంట్రవర్సీ కోసం అందరూ వెంపర్లాడుతున్నారు. బిగ్ బాస్ లో కూడా అదే జరగబోతోంది. జూలై 16నుంచి మా టీవీలో బిగ్ బాస్ షో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారం కాబోతోంది.

బిగ్ బాస్ లో 12 మంది సెలబ్రెటీలు పాల్గొంటారని ఇప్పటికే మాటీవీ, ఎన్టీఆర్ ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే ఆ 12 మంది ఎవరనే దానిపై సర్వత్రా ప్రచారం ఊపందుకుంది. మాటీవీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ బిగ్ బాస్ షోలో నటుడు పోసాని కృష్ణమురళి , ఒకప్పటి హీరోయిన్లు రంభ, సదా, స్నేహ, మంచు లక్ష్మీ పాల్గొంటున్నట్టు సమాచారం.

అయితే ఇందులో కాంట్రవర్సీకి మారుపేరు అయిన మత ప్రచారకుడు కే.ఏ పాల్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన అసలే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి ఆయన్ను బిగ్ బాస్ లో పెట్టి మాటీవీ అభిమానులకు పండుగ చూపించబోతోంది. ఆ 12 మందిలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది. బిగ్ బాస్ షో పై ఇప్పటికే విధివిధానాలు, ప్రోగ్రాం ఎలా ఉండబోతుందనే విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.

దాదాపు 71 రోజులపాటు ఒకే ఇంట్లో ఫోన్లు వాడకుండా, పేపర్ చూడకుండా..బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరి వంట వారు చేసుకుంటూ తింటూ ఉండాలి. ఇందులో సెలబ్రెటీలు కొట్లాడుకుంటారా.. ప్రేమించుకుంటారా లోలోపల రోమాన్స్ ఏమైనా జరుగుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఆ ఇంటినిండా వీడియో కెమెరాలు పెట్టి ఉంచుతారు..

To Top

Send this to a friend