జూన్ 1న “అమీ తుమీ”

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ”. వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకొన్నాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “విడుదల చేసిన తీజర్ కు విశేషమైన స్పందన లభించింది. అలాగే మే 10న మా సినిమాలోని మొదటి పాట “అయ్యా బాబోయ్” విడుదల కానుంది. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం. జూన్ 1న విడుదలకు సిద్ధమవుతున్న మా “అమీ తుమీ” తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది. సింక్ సౌండ్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. పాటలన్నిట్నీ ఆన్ లైన్ లోనే విడుదల చేసి.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నాం” అన్నారు.
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

To Top

Send this to a friend