పవన్ ఇష్యూ.. మహేశ్ కత్తిపై ఎన్టీఆర్ ఫైర్..

మహేశ్ కత్తి. ఇప్పుడు మీడియాలో సంచలనమైన పేరు.. బిగ్ బాస్ లో పాల్గొని అనంతరం ఎలిమినేట్ అయన మహేశ్ కత్తి.. ఆ తర్వాత వివిధ ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై పవన్ అభిమానులు భగ్గుమన్నారు. మహేశ్ కత్తిని టార్గెట్ గా పెట్టుకొని పవన్ అభిమానులు అతడికి ఫోన్ కాల్స్ చేస్తూ ఎస్.ఎం.ఎస్ లు పంపిస్తూ.. వాట్సాప్ మెసేజ్ లు బోలేడు పంపిస్తూ మహేశ్ కత్తిని చికాకు పెడుతున్నారు.

ఇంత చేసినా పవన్ అభిమానుల కోపం తగ్గలేదు. మహేశ్ కత్తి వ్యవహారాన్ని అంతా ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. ఈ వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడట.. పవన్ కళ్యాణ్ తనకు బాగా తెలుసు అని.. ఆయన చాలా మంచివాడని.. పవన్ అంటే తనకు చాలా అభిమానమని అన్న తారక్…. మహేశ్ కత్తి ఇలా దురుసుగా మాటలు మాట్లాడకుంటే బాగుండేదని అన్నాడట.. అంత పెద్ద స్టార్ ను పట్టుకొని మహేశ్ కత్తి ఇలా విమర్శించడం కరెక్ట్ కాదని స్పష్టం చేశాడట.. మొత్తానికి పవన్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఈ విషయాన్ని ఎప్పటికి వదిలేస్తారో చూడాలి..

To Top

Send this to a friend