గత జన్మ ఎలా ఉండేది? ఇది ఎప్పటి నుంచో అందరికి ఆసక్తిరేపుతున్న ప్రశ్న. అయితే ఆ ప్రశ్నలకు సమాధానమిస్తానంటున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. ప్రముఖుల గత జన్మల వివరాలను తెలుపుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు.
ఎస్వీనాగనాథ్ వీడియో వైరల్
యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ గత జన్మఎలా ఉండేది? గత జన్మ ఎక్కడ ఎలా సాగింది? అనే విషయాలపై ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్చల్ చేస్తోంది.
ఆరడుగుల అజానుబావుడు
పాస్ట్ లైఫ్‌లో జూ.ఎన్టీఆర్ యోధుడి జన్మ అని, ఆయన ఆరడుగుల ఎత్తులో ఉండేవాడని ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తెలిపారు. ఈ యోధుడు ఒక ట్రైబల్ ఏరియాలో జన్మించాడని చెప్పాడు. శతృవుని సంహరించడం, తనకు దాసోహమైన వాళ్లను కాపాడటం చేసేవాడని చెప్పాడు. తనను చంపాలనుకున్న శతృవులను తుదముట్టించాడని, గురువును మాత్రమే నమ్మేవాడట. ఎన్టీఆర్ గత జన్మపై చేసిన ఈ ఎపిసోడ్లో ఎస్వీనాగ్‌నాథ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నేను ఎవర్నీ..?
నమస్తే తెలుగు ఛానల్లో హూ ఐయామ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్రసారమవుతోంది. ఇందులో ప్రముఖుల గత జన్మ రహస్యాలను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్రసారమైన జూనియర్ ఎన్టీఆర్ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
ఫస్ట్ టైమ్
సినీ, రాజకీయ ప్రముఖులందరి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్లతో ఈ కార్యక్రమం ఉంటుందని, ప్రతి వారం ఒక ఎపిసోడ్ ప్రసారమవుతుందని ప్రొగ్రామ్ డైరెక్టర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్రసారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెలబ్రెటీల పాస్ట్ లైఫ్‌లను ఆవిష్కరించే ఇలాంటి కార్యక్రమం మీడియా చరిత్రలో తొలిసారని చెప్పారు.
