జర్నలిస్టుపై దాడి: నిజాలు..


ఉద్యోగం ఉండాలంటే యాడ్స్ తేవాలి. యాడ్స్ కావాలంటే ఎవరినైనా బతిమిలాడాలి.. లేదా బెదిరించాలి.. లేకపోతే వాళ్లు యాడ్స్ ఇవ్వరు.. దీంతో రిపోర్టర్లు నానాయాతన పడుతున్నారు. బడాబాబులను నయానో భయానో బెదిరిస్తున్నారు. ఇవ్వని వాళ్లు తిరగబడతారు.. నడిరోడ్డుపై చితకబాదతారు.. రాజమండ్రి టీవీ5 రిపోర్టర్ సురేష్ పై ఇలానే దాడి జరిగింది..

మొత్తంగా చూస్తే టీవీ5 రిపోర్టర్ సురేష్ .. ఓ డాక్టర్ పై లైవ్ లో ఆయన ఎదురుగానే మాట్లాడుతున్నాడు. చిర్రెత్తుకొచ్చిన డాక్టర్ తనపై టీవీలో ప్రసారం చేస్తావా అని నడిరోడ్డుపై టీవీ5 రిపోర్టర్ పై దాడి చేశాడు. అనంతరం తనను రూ.5 లక్షల యాడ్ ను టవీ5కు ఇమ్మన్నాడని.. ఇవ్వకపోయేసరికి ఇలా బెదిరిస్తున్నాడని డాక్టర్ వాపోయాడు.

ఇందులో జర్నలిస్టుపై ఓ డాక్టర్ ఎంత దారుణమో.. జర్నలిస్టుదీ కూడా అంతే తప్పు… ఎందుకంటే రూ.5 లక్షల యాడ్ ఇవ్వనందుకు తన ఆస్పత్రిని, తనను అభాసుపాలు చేస్తున్నాడని రిపోర్టర్ పై దాడి చేశాడు డాక్టర్.. యాడ్స్ ఇవ్వనిదే సంస్థలో ఉద్యోగ భద్రత ఉండదని రిపోర్టర్ ఇలా బెదిరింపులకు దిగాడు. యాజమాన్యాల నిరంకుశ యాడ్ కలెక్షన్ల మూలంగా రిపోర్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒక్క వీడియో ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితికి అద్దం పడుతోంది..

టీవీ5 జర్నలిస్టు సురేశ్ పై డాక్టర్ దాడి చేసిన వీడియోను సంభాషణను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend