జర్నలిస్టులు చచ్చిపోతున్నా పట్టదా కేసీఆర్ సారూ..!


హెల్త్ కార్డులు.. హెల్త్ కార్డులు… తెలంగాణ ఏర్పడి మూడేళ్లయ్యాక కానీ ఇచ్చేందుకు కేసీఆర్ కు తీరలేదు. కొన్ని నెలల కింద ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చింది. ఇటీవలనే జర్నలిస్టులకు సైతం హెల్త్ కార్డుల పంపిణీని చేపట్టింది. అంతా బాగానే ఉంది. అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఉద్యోగులు కేసీఆర్ కు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. కానీ సమస్య అక్కడే మొదలైంది..

ప్రైవేటు ఆసుపత్రులేవీ ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులను పరిగణలోకి తీసుకోవడం లేదు. వారికి ఉచితంగా వైద్య సేవలు అందివ్వడం లేదు. రోగమొచ్చి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డు పనిచేయడం లేదనే సమాధానం వస్తోంది. దీంతో అవాక్కవడం వారి వంతవుతుంది..

కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు… తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వైద్యానికి సంబంధించిన ఖర్చుల లెక్కల మీద ఒప్పందం ఎటూ తేలకపోవడంతో ఈ సమస్య దాపురించింది. ప్రభుత్వం ఇచ్చే తక్కువ వైద్య ఖర్చులకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు నో చెప్పడంతో ఉచిత వైద్యం ప్రస్తుతానికి పడకేసింది. ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కానీ, సీఎం కేసీఆర్ కానీ ఈ విషయంలో పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో రోగాలొచ్చి ఉద్యోగులు, జర్నలిస్టులు ఆస్పత్రులకు వెళితే వారికి ఉచిత వైద్యం అందడం లేదు. ఖర్చులు భరించలేక ఎంతో మంది జర్నలిస్టులు ఇటీవలే చనిపోవడం ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతోంది..

తెలంగాణ ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటి.. చేసేది మరొకటిగా ఉంది. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ కార్డులను యాక్సెప్ట్ చేయకపోవడంతో వారంత ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.కానీ అక్కడ వైద్యం నాసిరకంగా నిర్లక్ష్యంగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అంతా ఉచితమే.. అలాంటప్పుడు ఈ హెల్త్ కార్డులు ఇచ్చి ఏం ప్రయోజనమని ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఇటీవల ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి జబ్బు సోకి కాళ్లకు ఇన్ ఫెక్షన్ సోకింది. హెల్త్ కార్డు ఉంది కదా అని కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే ఆమెకు వైద్యం నిరాకరించారు. దీంతో చేసేందేం లేక గాంధీ ఆస్పత్రికి వెళ్లిందట.. అక్కడ వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె జబ్బు ఎక్కువై లేవలేకుండా అయ్యింది. కేసీఆర్ ఇచ్చిన హెల్త్ కార్డులు చెత్త బుట్టలో పడేయాలని వాపోయింది.. తనను కాపాడండి అని కాళ్ళ వెళ్ళ పడ్డ ఆస్పత్రుల్లో మానవత్వం చూపడం లేదని బాధపడింది…..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డు అమలు కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు సదురు ప్రభుత్వం ఉద్యోగి ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో విడుదల చేసింది. తనకు బ్రతికున్నప్పుడు పనిచేయని ఎంప్లాయ్ హెల్త్ కార్డు చనిపోతే మాత్రం “మార్చ్యూరి”కి ఉచితంగా పనిచేస్తదేమో అని కన్నీరుమున్నీరుగా విలపించింది.. ఆ వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend