తెలంగాణలో ఉద్యోగాలు.. జీవితకాలం లేటు..

ఏపీలో ఇప్పటికే డీఎస్సీ వేశారు.. ఉద్యోగాలిచ్చారు. మరికొన్ని ఉద్యోగాలు కూడా కల్పించారు. కానీ తెలంగాణలోనే ఉద్యోగాల కల్పనకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డగోలు నిబంధనల వల్ల కొందరు అన్యాయం జరుగుతోందని కోర్టుకు పోయి ఉద్యోగాలు వాయిదా వేయిస్తున్నారు. మొన్నటీ గ్రూపు 2 నుంచి నేటి టెట్, డీఎస్సీ వరకు కూడా కేసీఆర్ పాలనలో ఒక్కరికి ఉద్యోగాలు లభించలేదు. అవి వాయిదాలు పడుతూనే ఉన్నాయి.

డిప్యూటీ సీఎం కం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో.. అమలు చేయడంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. ఉద్యోగాల్లో కోర్టు కేసులతో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. మూడు నెలల్లో డీఎస్సీ పెట్టమని సుప్రీం ఆదేశించినా పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. తాజాగా తెలంగాణలో మంత్రి కడియం టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత డీఎస్సీ వేస్తారట.. ఈ టెట్ నిర్వహణకు ఏవో నిబంధనలు మళ్లీ కోర్టుకెళ్తే టెట్ ఆగిపోతుంది. డీఎస్సీ నిర్వహణ కష్టమే.. ఇలా అసంబద్ధ విధానాలతో నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ సర్కారు ఆడుకుంటోంది.

తెలంగాణ నిరుద్యోగులందరూ తమకు రాష్ట్రమస్తే ఉద్యోగాలొస్తాయని సంబరపడ్డారు. కానీ అడ్డగోలు నిబంధనలు, ఎక్కడ లేని పరీక్షలు, ప్రశ్నాపత్నం మార్పులతో పరీక్షలు ముందుకు సాగడం లేదు. నోటిఫికేషన్ వేశాక కూడా రద్దయిన పరీక్షలు తెలంగాణలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగ లోకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లవుతున్న ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్ సర్కారుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

To Top

Send this to a friend