జియోను తలదన్నే ఆఫర్


ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో మేనియా నెలకొంది. జియో ఆఫర్లతో వినియోగదారులందరూ కుషీకుషీగా ఉండగా.. ప్రత్యర్థి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు మాత్రం బెంబేలెత్తుతున్నారు. కానీ ఇప్పుడు జియోను తలదన్నేలా టెలినార్ కంపెనీ అద్భుత ఆఫర్ ప్రకటించింది. ఏపీ తెలంగాణలోని సర్కిల్స్ లో కొత్త 4జీ వినియోగదారులకు అపరిమిత డేటా ఆఫర్ ను ప్రకటించింది..

టెలినార్ వినియోగదారులు 73 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే వినియోగదారులకు 30 రోజుల పాటు అపరిమిత 4జీ/2జీ ఇంటర్నెట్ సర్వీసులను అందించనున్నట్లు టెలినార్ తెలిపింది. ఈ ఆఫర్ తో పాటు 90 రోజుల పాటు 25 పైసలకే లోకల్ , ఎస్టీడీపీ కాల్స్ ను అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ కూడా ఆఫర్ చేసింది..

జియో దెబ్బకు కుదేలవుతున్న అన్ని టెలికాం కంపెనీలు ఎలా గట్టెక్కాలని ఆలోచిస్తున్నాయి. పలు కంపెనీలు ఉచిత డేలా, కాల్స్ ఆఫర్ చేస్తున్న వినియోగదారులకు చేరువ కావడం లేదు. కానీ చిన్న కంపెనీ అయినప్పటికి టెలినార్ అద్భుత ఆఫర్ తో జియో పోటీని తట్టుకుంటోంది.

To Top

Send this to a friend