జియో ఫోన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ఉచిత ఫీచర్ ఫోన్ బుక్సింగ్స్ కు వేళయ్యింది. ఆగస్టు 24 గురువారం సాయంత్రం 5 గంటలనుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇలా బుక్ చేసుకున్న కస్టమర్ల కు సెప్టెంబర్ ఒకటి నుంచి ఫోన్ల డెలివరీ ఉంటుంది. 24న గురువారం నుంచి జియో ఫీచర్ ఫోన్ బుక్సింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ లో .. మైజియో యాప్ తో పాటు జియో.డాట్ కామ్ ద్వారా ఈ ఫోన్ ను బుక్ చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ లో భాగంగా జియో రిటైలర్లు, మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఫోన్ కావలసిన వినియోగదారులు బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. 500 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మిగతా 1000 రూపాయలు ఫోన్ డెలివరీ తీసుకున్నప్పుడు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

*- జియో ఫోన్ ఫీచర్లు ఇవే..
ఇక ఈ ఫోన్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్, మ్యాప్స్, యూట్యూబ్, ఫేస్ బుక్, క్రోమ్, ఫైర్ ఫ్యాక్స్ సపోర్ట్ చేస్తుంది. కానీ వీట్సాప్ ఒక్కటే ఈ ఫోన్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. ఇక జియో ఉచితంగా అందించే యాప్స్ అన్నీ ఇందులో వాడుకోవచ్చు. జియో ఫోన్ భారతదేశంలోని 22 భాషలను సపోర్ట్ చేస్తుంది. 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, వెనుకాల 2 మెగా పిక్సల్ కెమెరా, ముందు వీజీఏ కెమెరాతో వీడియోకాల్ కూడా చేసుకోవచ్చు. ఇందులో 4జీబీ ఇంటర్నెల్ మెమరీ ఉంది. 128జీబీ వరకు మెమరీ కార్డ్ తో పెంచుకోవచ్చు.

To Top

Send this to a friend