జియో ఇచ్చిన ముఖేష్ కు ఏమిచ్చినా తక్కువే..

‘నలుగురిని చంపితే శూరుడంటారు.. కానీ అదే నలుగురిని కాపాడితే దేవుడంటారు’ బాహుబలిలో శివగామి చెప్పిన డైలాగ్ ఇదీ.. ఈ డైలాగ్ జియోను దేశీయ టెలికాం రంగంలోకి తీసుకొచ్చిన ముఖేష్ అంబానీకి సరిగ్గా సరిపోతుంది. దేశాన్నీ 4జీ సేవలతో డిజిటల్ బాట పట్టించిన ఘనుడాయన.. అప్పటివరకు 250 రూపాయలు పెడితే కానీ దొరకని 1జీబీ ఇంటర్నెట్ సేవను ఏకంగా అత్యధిక స్పీడ్ 4జీతో సంవత్సరం పాటు ఉచితంగా ఇచ్చారాయన. ఈ నిర్ణయం ఫలితంగా నిరుద్యోగులు, ప్రజలు, పేదలు, మధ్యతరగతి వారు తమ పనులను చాలా చవకగా చేసుకున్నారు. లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా మిగతా టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే చాలా చవకగా ఇంటర్నెట్ అందిస్తున్నారు. అందుకే ముఖేష్ అంబానీ ఇప్పుడు జియో కస్టమర్లకు దేవుడయ్యారు.

దేశ టెలికాం రంగంలోనే విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే పరిశ్రమ గతిని మార్చిన 25 మంది అగ్రస్థాయి వ్యాపార, పారిశ్రామికవేత్తలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తొలిస్థానాన్ని దక్కించుకున్నారు.. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన వార్షిక గేమ్ చేజింగ్ పారిశ్రామికవేత్తల జాబితాలో ముఖేష్ మహామహులను పక్కకుపెట్టి మొదటి స్థానంలో నిలిచారు. భారతదేశ ముఖచిత్రాన్ని జియోతో ముఖేష్ మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.. చైనా, అమెరికాలను మించి ఇంటర్నెట్ వాడకంలో ముందుంచిన ముఖేష్ అంబానీకి ఈ గొప్ప గుర్తింపు లభించింది.

టెలికాం రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లను వెనక్కి నెట్టి ఇంటర్నెట్ ను పేదలు, మద్యతరగతి, ఉద్యోగుల దరికి చేర్చడంలో ముఖేష్ అంబానీ చేసిన సేవలు వెలకట్టలేనివి ఫోర్బ్స్ పత్రిక ఈ మేరకు ముఖేష్ ను కొనియాడింది. జియో పేరుతో భారత టెలికాం రంగంలోకి ప్రవేశించి అత్యంత చౌకగా వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించడం ద్వారా పెద్ద సంచలనానికి ముఖేష్ కారణమయ్యారని ఫోర్బ్స్ పత్రిక ప్రశంసించింది. ఆయన ఆశయానికి తగ్గట్టు ఆరు నెలల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లు చేరారని.. భారత్ ను డిజిటల్ బాట పట్టించినందుకు ముఖేష్ కు అభినందనలు తెలిపింది. కాగా ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ఇజ్రాయిల్ కు చెందిన మొబిల్ ఐ వ్యవస్థాపకులు జివ్ అవిరామ్, అమ్మాన్ షాషా రెండో స్థానంలో నిలిచారు. అమెరికాకు చెంది స్లాక్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవార్డ్ బటర్ ఫీల్డ్ మూడోస్థానంలో నిలిచారు.

ముఖేష్ అంబానీ జియోతో ఇంటర్నెట్ ఫ్రీ ఇచ్చినందుకు కృతజ్ఞతగా కొందరు యువకులు రూపొందించిన బాహుబలి పేరడి సాంగ్ వీడియోను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend