జియో.. మరోసారి రంగంలోకి..


జియోకు మద్దతు పెరుగుతోంది. జియో ప్రకటించిన 303 రీచార్జ్ ఫ్రీ ఆఫర్ ను ట్రాయ్ తిరస్కరించడం.. జియో వెనక్కి తగ్గడం జరిగిపోయాయి. దీనికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమకారులు ట్రాయ్ పై పిటీషన్లు దాఖలు చేశారు. దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లు అడ్డుగోలు ధరలతో సామాన్యుడి నడ్డి విరుస్తుంటే… జియో దేశాన్ని డిజిటల్ ఇండియా గా మార్చేందుకు ఉచిత డేటా అందిస్తోందని.. జియో వల్ల విద్యార్థులు, వ్యాపారులు, సామాన్యులకు మేలు జరుగుతోందని.. జియో ఆఫర్లను కొనసాగించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.

ఈ నేపథ్యంలో ట్రాయ్ నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తూ జియో ఉచిత ఆఫర్ ను తీసేసింది. కానీ జనాభిమానాన్ని తిరిగి పొందేందుకు కొత్తగా పోటీని తట్టుకోవడానికి, కొత్త సబ్ స్ర్కైబర్స్ ను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను లాంచ్ చేస్తామని జియో తన వెబ్ సైట్లో ప్రకటించింది.

త్వరలోనే మరింత చవకైన టారిఫ్ ప్లాన్ లను తెస్తున్నట్టు జియో చెప్పింది. అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారులకు సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తామని తెలిపింది. ఈ దెబ్బతో టెలికాం రంగం మరోసారి షేక్ అయ్యింది. ఇప్పటికే ప్రైమ్ మెంబర్ షిప్, 303 రీచార్జ్ లతో వినియోగదారులను తన్నుకుపోయిన జియో ఆ ఆఫర్ ముగియడంతో ఎయిర్ టెల్, ఐడియా , వోడాఫోన్ లు ఊపిరిపీల్చుకున్నాయి. కానీ అది అయిపోగానే మరో ఉచిత ఆఫర్ తో జియో సన్నద్ధమవడంతో వాటికి షాక్ ఇచ్చినట్టేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

To Top

Send this to a friend