జియో ధర పెంపు..

రిలయన్స్ జియో కొద్దిగా ధర పెంచింది. రోజురోజుకు నష్టాలు పెరుగుతుండడంతో వినియోగదారులకు ఉచిత సేవలందిస్తూనే ధరల్ని మాత్రం కొద్దిగా పెంచింది. రిలయన్స్ జియో మూడు నెలల క్రితం ప్రకటించిన జియో ధన్ ధనా ధన్ ఆఫర్ ను సవరించింది. రూ.309తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు ఉచిత కాల్స్, ఎస్.ఎం.ఎస్, రోజుకు 1జీబీ డేటా అందించింది. ఇప్పుడా పరిమితిని రూ.399 కు పెంచింది. వినియోగదారులు ఇక నుంచి 399తో రీచార్జ్ చేసుకోవాలి. తద్వారా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్, ఎస్.ఎం.ఎస్. రోజు1జీబీ డేటాను పొందుతారు..

మిగతా టెలికాం ఆపరేటర్లతో పోల్చితే తక్కువకే ఉచితంగా కాల్స్, ఎస్.ఎం.ఎస్, డేటా సేవలను రిలయన్స్ అందిస్తోంది. జియో దెబ్బకు ఇప్పటికే దేశ టెలికాం పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. అయినా ముఖేష్ అంబానీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలో మరోమారు కొత్త పథకాన్ని రూ.399 రీచార్జ్ తో ప్రవేశపెట్టారు..

జియో ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా కాల్స్, డేటా,ఎస్.ఎం.ఎస్ సహా అన్నీ సేవలు అందబోతున్నాయి. జియో ధన్ ధనాధన్ పథకం 309కి మరో 90 రూపాయలు అదనంగా కలిపి వినియోగదారులకు 399 రీచార్జ్ పథకాన్ని తెచ్చారు. ఇది వేసుకుంటే మూడు నెలల పాటు ఉచితంగా అన్నీ ఫ్రీ పొందవచ్చు.ఇక పాత 309 పథకాన్ని కూడా జియో కొనసాగించింది. కానీ దాని కాలపరిమితిని 56 రోజులకే తగ్గించింది. 56 రోజుల పాటు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1 జీబీ చొప్పున 56జీబీ పొందవచ్చు. జియో 100 రూపాయల అదనపు భారం మాత్రమే మోపి 3 నెలలు ఫ్రీ సర్వీస్ ఇవ్వడంతో వినియోగదారులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend