బాబు, పవన్ స్నేహంపై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్ తానుప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న ప్రకటన చేయడంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఎప్పటి నుంచో భాయీ భాయీ అని వ్యాఖ్యానించారు. ఈ భేటీలో కొత్తదనం ఏమీ లేదన్నారు. జగన్‌ వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు.

అటు టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్‌ కూడా పవన్ కల్యాణ్‌ రాజకీయంపై స్పందించారు. పవన్ కల్యాణ్ టీడీపీ మనిషి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దగ్గరకు వచ్చి గంటసేపు గడిపి భోజనం కూడా చేసి వెళ్లారు కదా అని అన్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కలిసి వచ్చినా గతంలో ఏమి జరిగిందో ప్రజలంతా చూశారని ప్రజారాజ్యం గురించి ప్రస్తావించారు.

To Top

Send this to a friend